Vish Yog Effect On Zodiac: అక్టోబర్ 9వ తేది ఈ రోజు చంద్రుడు రాశి సంచారం చేశాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు కన్యా రాశిలోకి సంచారం చేశాడు.. ఇప్పటికే శని గ్రహం మీన రాశిలో సంచార దశ కొనసాగుతోంది. కన్యారాశి, మీన రాశిలు ఒకదానికొకటి ఏడవ స్థానాల్లో ఉండడం వల్ల చంద్రుడితో పాటు శని మధ్య విష యోగం (Vish Yog) ఏర్పడిందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దీని ప్రభావంతో కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడితో పాటు శని గ్రహాల వ్యతిరేక ప్రభావంతో కొన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ యోగంతో మానసిక ఆరోగ్యం కూడా ఊహించని స్థాయిలో దెబ్బతింటుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి సమస్యలు తప్పవు..
మేషరాశి
విష యోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి ఈ అక్టోబర్ నెలలో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా అనవసరమైన గొడవలకు తప్పకుండా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాహనాలు నడిపే క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు మానసిక ప్రశాతత కోసం తప్పకుండా హానుమాన్ చాలీసా పఠించడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులారాశి
తులా రాశివారు కూడా ఈ సమయంలో తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఆదాయం కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు దెబ్బతింటాయి. చంద్రుడితో ప్రభావంతో ఉద్యోగాలు చేసేవారు తప్పకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులతో విబేదాలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అనేక కారణాల వల్ల ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు అనుకున్న పనులు కూడా జరగకుండా ఉండిపోతూ ఉంటాయి. అలాగే వీరు ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్లడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. దీంతో పాటు ప్రతికూల ప్రభావం పెరిగి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.