• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Mobile Care: మీ ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి!

Mobile Care: మీ ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి!

Mobile Phone Care: చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మొబైల్ ఎప్పుడు రిపేర్ వస్తూ ఉంటుంది. అయితే, ఈ క్రింది చిన్న పొరపాట్ల కారణంగానే మొబైల్ పాడైపోతోందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువ రోజులపాటు మొబైల్ బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 11:30 AM IST|Updated: Oct 25, 2026, 11:32 AM IST
joinshare
Mobile Care: మీ ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
జగిత్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. అత్యల్పంగా 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత!

జగిత్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. అత్యల్పంగా 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత!

2

హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్ వీరంగం.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొరికిన యువకుడు!

3

రాజా నగరం బుచ్చంపేట ఎంపీటీసీ సీటు వెనక అసలు లెక్కెంటీ.. జక్కంపూడి Vs కూటమి..!

4

Mobile Care: మీ ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి!

5

భర్త వివాహేతర సంబంధం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mobile Phone Care Tips: ఆధునిక జీవనశైలి కారణంగా స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధంగా మారిపోయింది. బ్యాంకు పనుల నుంచి ఉద్యోగాల బాధ్యత వరకు సమస్త మొబైల్ ఆధారంగానే సాగుతూ వస్తున్నాయి. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్స్‌ కొద్ది నెలలకి వేడెక్కడంతో పాటు బ్యాటరీ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి.. తరచుగా రిపేర్ కు వస్తూ ఉంటాయి. అయితే.. నిత్యజీవితంలో మనం తెలియకుండా చేసే చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దుకుంటే స్మార్ట్‌ఫోన్‌ను ఏళ్ల తరబడి ఎటువంటి సమస్యలు లేకుండా వాడుకోవచ్చని.. సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఫోన్ దీర్ఘకాలం బాగుండాలంటే నాలుగు కీలకమైన జాగ్రత్తలు పాటిస్తే చాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వేడిగా ఉండకూడదు..
స్మార్ట్ ఫోన్ కు అతిపెద్ద శత్రువు విపరీతమైన వేడిగా భావించవచ్చు. ఎండ తీవ్రత నేరుగా తగిలేలా కిటికీల వద్ద లేదా ఎండలో పార్క్ చేసిన వాహనాల డాష్ బోర్డులపై మొబైల్ ఎప్పుడు ఉంచకూడదు.  అధిక ఉష్ణోగ్రత వల్ల మొబైల్ లోని లిథియం అయాన్ బ్యాటరీ అంతర్గత రసాయనాల సమతుల్యత దెబ్బతిని.. బ్యాటరీ సామర్థ్యం వేగవంతంగా తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా ప్రాసెసర్లతో పాటు డిస్ప్లేలు వంటి ఇతర సామర్థ్యం వేగంగా తగ్గిపోయే ఛాన్సులు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో చిన్న చిన్న పార్ట్స్ కూడా కరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట..

ఇలా చార్జింగ్ చేయండి..
చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ చార్జింగ్ పెట్టి పిల్లో కింద లేదా పరుపుల పై పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటని.. చార్జింగ్ అవుతున్న సమయంలో ఫోన్ సహజంగానే కొంత వేడిని విడుదల చేస్తుందని.. గాలి తగలని మూసి ఉన్న ప్రాంతాల్లో ఉంచడం వల్ల వేడి బయటకు పోలేక బ్యాటరీ ఉబ్బిపోయే అవకాశాలు ఉన్నాయని.. కొన్ని కొన్ని సందర్భాల్లో పేలిపోయే ముప్పు కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఎల్లప్పుడు గాలి బాగా ఉన్న ప్రాంతాల్లో చార్జింగ్ పెట్టడం చాలా మంచిది. అంతేకాకుండా నకిలీ చార్జర్లతో పాటు పాడైపోయిన కేబుల్స్‌తో ఎప్పుడు చార్జింగ్ పెట్టకూడదు..

చార్జింగ్ పోర్టులు ఇలా శుభ్రంగా ఉంచుకోవాలి..
ఫోన్ జేబులో లేదా బ్యాగుల్లో ఉంచినప్పుడు చార్జింగ్ పోర్టులోకి దుమ్ము ధూళితో పాటు బట్టలు పోగులు వెళుతూ ఉంటాయి. వీటివల్ల పిన్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం.. చార్జింగ్ నెమ్మదిగా ఎక్కడం, కనెక్షన్ లూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చార్జింగ్ స్లో అవుతుంది అని ఎప్పుడు సెల్ పాయింట్స్ కి వెళ్లే వారు ఇది ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది.. అంతే కాకుండా ఎప్పటికప్పుడు చార్జింగ్ పోర్టులను క్లీన్ చేసుకోవడం వల్ల మొబైల్ ఎక్కువ రోజులపాటు వస్తుంది.

సాఫ్ట్వేర్ అప్డేట్స్..
సాఫ్ట్వేర్ అప్డేట్లను చాలామంది అనవసరమైన ప్రక్రియగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ కంపెనీలు విడుదల చేసే సిస్టం, సెక్యూరిటీ అప్డేట్ లలో కొత్త భద్రత ఫ్యాచ్చులు వస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల హ్యాకర్ల నుంచి డేటా సురక్షితంగా ఉండడంతో పాటు ఫోన్ వేగం, బ్యాటరీ పనితీరు కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఫోన్ సంవత్సరాల తరబడి మన్నికగా ఉండాలంటే చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉండడం చాలా మంచిది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News