SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గేమర్స్‌కు గుడ్ న్యూస్.. అక్టోబర్ చివరి వారంలో ఐకూ నియో 12 సిరీస్‌ లాంచ్? ఫీచర్స్ లీక్‌!

Iqoo Neo 12: అక్టోబర్ చివరి వారంలో ఐకూ నియో 12 సిరీస్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 04:12 PM IST | Updated: Oct 09, 2026, 04:15 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Iqoo Neo 12: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ సొంతం చేసుకున్న బ్రాండ్స్‌లో iQOO ఒకటి. ఈ కంపెనీ ఎప్పుడు అద్బుతమైన స్మార్ట్‌ఫోన్స్‌తో యువతను ఎంతగానో ఆకర్శిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే నియో సిరీస్‌లో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ ఐకూ నియో 12 (iQOO Neo 12) పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ (Geekbench) వెబ్‌సైట్‌లో కనిపించడంతో పాటు.. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. అయితే, దీనిని అక్టోబర్‌ చివరి వారంలో చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

లీక్ అయిన వివరాల ప్రకారం.. ఇది V2618A మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది.. ముఖ్యంగా దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది.. ముఖ్యంగా మల్టీ-టాస్కింగ్, హెవీ గేమింగ్ చేసేవారి ఇందులో కంపెనీ గరిష్టంగా 16GB ర్యామ్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. సింగిల్-కోర్ అలాగే మల్టీ-కోర్ పరీక్షల్లో అత్యధిక పాయింట్లను సాధించినట్లు కూడా తెలుస్తోంది. అయితే, త్వరలోనే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌కి సంబంధించిన అన్ని వివరాలను అందించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

అద్భుతమైన డిస్‌ప్లే..
ఈ ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.83 అంగుళాల కస్టమ్ 2K+ అమోలెడ్ (AMOLED) డిస్ల్పేతో వచ్చే ఛాన్స్‌లు ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో గరిష్టంగా 185Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు విజువల్స్‌ అద్బుతంగా కనిపించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది ఎండలో కూడా చాలా అద్బుతంగా కనిపిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను రోజంతా వినియోగించేందుకు ఇది వపర్‌ఫుల్‌ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది 9,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా టెక్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం... ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అద్భుతమై కూలింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో ఇది లాంచ్ కాబోతోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES