• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala Brahmotsavam: తిరుమలకు ఉత్సవ శోభ.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

Tirumala Brahmotsavam: తిరుమలకు ఉత్సవ శోభ.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

All Set To Tirumala Brahmotsavam 2026: తిరుమల బ్రహ్మోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల సందర్భంగా తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 09, 2026, 05:06 PM IST|Updated: Oct 09, 2026, 05:10 PM IST
joinshare
Tirumala Brahmotsavam: తిరుమలకు ఉత్సవ శోభ.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు
Image Credit: Tirumala Brahmotsavam 2026

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!

2

Aggipetti macha: ఏం మనుషుల్రా.. రెండురోజులైన అంతిమ సంస్కారాలకు నోచుకొని అగ్గిపెట్టెమచ్చ.. అసలు రచ్చ ఇదే..

3

25 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూపులు.. బాధిత రైతుల ఆందోళన!

4

Tirumala Brahmotsavam: తిరుమలకు ఉత్సవ శోభ.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

5

నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా? ఏం తినాలి? ఏవి తినకూడదు? 9 రోజుల రోజువారీ ఫుడ్ గైడ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala Temple: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమలకు ఉత్సవ శోభ సంతరించుకుంది. నవరాత్రుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా దీని కోసం భారీ స్థాయిలో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరువూరు శనివారాలు ప్రారంభమై మూడు శనివారాలు పూర్తికావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దసరా సెలవులు కూడా రానుండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

తిరుమల బ్రహ్మోత్సవాలకు దేశ విదేశీ భక్తులు తరలిరానున్నారు. భక్తుల తాకిడి భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన టీటీడీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రధాన వాహనసేవల సమయంలో భారీగా పెరగనున్న రద్దీని నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి దసరా సెలవులు కూడా కలిసి రావడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాల గరుడసేవకు 3 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అఖండ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడా రద్దీ అదుపు తప్పకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 12న రాత్రి పెద్దశేష వాహనసేవతో వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టమైన అక్టోబర్ 16న గరుడ సేవ జరగనుంది. ఈ సేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉండడంతో ఆ రోజు రద్దీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నాలుగు మాడ వీధుల్లో భక్తులు సురక్షితంగా స్వామివారి గరుడసేవను వీక్షించేలా ప్రత్యేక గ్యాలరీలు, బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఒక్కసారిగా ఒకే ప్రాంతానికి చేరకుండా రద్దీని క్రమబద్ధీకరించేలా భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనున్నారు.

బంగారు రథోత్సవం కూడా బ్రహ్మోత్సవాల్లో మరో ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రధాన వాహనసేవల సమయంలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నాలుగు మాడ వీధులను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ప్రత్యేక లైటింగ్ షోలతో తిరుమలలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తులో మోహరించనున్నారు. వీరితోపాటు సుమారు 2,500 మంది టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నాలుగు మాడ వీధులతో పాటు శ్రీవారి ఆలయం పరిసరాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచనున్నారు..

అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు 3 వేలకుపైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. భక్తుల రద్దీ, వాహనాల కదలికలు, కీలక ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. నాలుగు మాఢ వీధుల్లో ప్రత్యేక హైఎండ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉండడంతో ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గరుడసేవ, బంగారు రథోత్సవం వంటి ప్రధాన ఘట్టాల సమయంలో భక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు అందుబాటులో ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపైనా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని అందుబాటులో ఉంచి మాడ వీధులు, క్యూలైన్లు, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.

భక్తుల వసతి, రవాణా, క్యూ లైన్ల నిర్వహణకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా క్రమబద్ధీకరించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తిరుమలకు వచ్చే వాహనాలు, తిరుమల నుంచి తిరిగి వెళ్లే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ భక్తుల కదలికలకు అనుగుణంగా ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Spirituality
TTD News
Telugu News
Trending News