SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వార్నింగ్! హ్యాండ్ లగేజ్‌లో పొరపాటున కూడా ఈ 10 వస్తువులు పెట్టకండి.. జైలు లేదా ఫైన్ తప్పదు!

మీరు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఆదివారం ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో, ప్రయాణికుడు తన లగేజీలో పవర్ బ్యాంక్ ఉంచడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పవర్ బ్యాంక్ వంటి వస్తువులను విమాన ప్రయాణంలో తీసుకెళ్లకూడదని, అలా తీసుకెళ్తే భారీ జరిమానాలు విధిస్తారని గుర్తుంచుకోండి. విమాన ప్రయాణంలో పొరపాటున కూడా తీసుకెళ్లకూడని 10 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 11, 2026, 07:25 PM IST | Updated: Oct 11, 2026, 07:29 PM IST
Image Credit: Airport Security Alert
Join

విమాన ప్రయాణం మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఇది ఉత్తమ మార్గం. అయితే, విమాన ప్రయాణంలో లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పవర్ బ్యాంకులు, మ్యాచ్ బాక్సులు, కొన్ని రకాల ద్రవ పదార్థాలను  నిషేధించారు. ఆదివారం జరిగిన ఘటనలో, ఇండిగో విమానంలో ప్రయాణికుడి లగేజీలోని ఎలక్ట్రానిక్ పరికరం పేలి పొగ రావడంతో, క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇలాంటి పొరపాట్లు చేస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. విమాన ప్రయాణంలో క్యాబిన్ బ్యాగేజ్, చెక్-ఇన్ లగేజ్ వేర్వేరుగా ఉంటాయి.

హ్యాండ్ లగేజ్‌లో తీసుకెళ్లకూడని వస్తువులు ఇవే..
పదునైన వస్తువులు: 
కత్తులు, కత్తెరలు, రేజర్ బ్లేడ్‌లు, నెయిల్ కట్టర్స్ వంటివి క్యాబిన్ బ్యాగేజ్‌లో అనుమతించరు. ఇవి ఆయుధాలుగా మారే అవకాశం ఉన్నందున, వీటిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే పెట్టాలి.

ద్రవ పదార్థాలు: 
100 ml కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే షాంపూలు, సాస్‌లు, పచ్చళ్లు లేదా పెర్ఫ్యూమ్‌లను హ్యాండ్ లగేజ్‌లో తీసుకెళ్లకూడదు. మీరు వీటిని ఎంత బాగా సీల్ చేసినా, సెక్యూరిటీ వారు వాటిని తొలగిస్తారు.

మంటలను ప్రేరేపించే వస్తువులు: లైటర్లు, మ్యాచ్ బాక్సులను డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో హ్యాండ్ బ్యాగ్‌లో తీసుకెళ్లకూడదు. అవసరమైతే ప్రయాణ గమ్యస్థానానికి చేరుకున్నాక కొనుగోలు చేయడం మంచిది.

పవర్ బ్యాంకులు: 160W కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులు పూర్తిగా నిషేధం. వీటిని కేవలం క్యాబిన్ బ్యాగ్‌లలో మాత్రమే అనుమతిస్తారు. చెక్-ఇన్ లగేజ్‌లో పెట్టకూడదు. ఓవర్ సైజ్ పవర్ బ్యాంకుల వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉంది.

టూల్స్ .. చెట్లు నరకడానికి లేదా డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించే పరికరాలను విమానంలో తీసుకెళ్లకూడదు.

స్పోర్ట్స్, ఫిట్నెస్ గేర్: క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్‌లు, రాకెట్లు, డంబెల్స్, స్కిప్పింగ్ రోప్స్ వంటివి హ్యాండ్ బ్యాగ్‌లో తీసుకెళ్లకూడదు; వీటిని చెక్-ఇన్ లగేజ్‌లోనే ఇవ్వాలి.

ఎలక్ట్రానిక్ సిగరెట్లు: ఇవి క్యాబిన్ లేదా చెక్-ఇన్ లగేజ్, రెండింటిలోనూ పూర్తిగా నిషేధించబడ్డాయి. వీటిని ఉంచుకుంటే జరిమానా విధించే అవకాశం ఉంది.

స్ప్రేలు: పెద్ద పరిమాణంలో ఉండే డియోడరెంట్లు, హెయిర్ స్ప్రేలు, ఇన్సెక్ట్ స్ప్రేలను హ్యాండ్ లగేజ్‌లో తీసుకెళ్లకూడదు. 100 ml లోపు ఉంటే సెక్యూరిటీ వారు అనుమతించే అవకాశం ఉంటుంది, లేదంటే వాటిని తీసివేస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES