SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎయిర్‌టెల్ 1+1 ఉచిత రీఛార్జ్ ధమాకా..! డబుల్ బెనిఫిట్స్ ఇచ్చే రూ.349, రూ.399 ప్లాన్స్ ఇవే!

ఎయిర్‌టెల్ ఇనాక్టివ్‌గా ఉన్న సిమ్ల కోసం ఒక బంపర్ రీఛార్జ్ ప్లాన్ను అందిస్తోంది. చాలామంది సిమ్ కార్డ్ వినియోగదారులు రెండు సిమ్లను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు ఒక సిమ్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. అలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ ఒక భారీ శుభవార్త తెచ్చింది. వారి కోసం వన్ ప్లస్ వన్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర కేవలం రూ.349 లేదా రూ.399 కాగా, ఈ మొత్తంతో రీఛార్జ్ చేస్తే తదుపరి రీఛార్జ్ ఉచితంగా లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 09, 2026, 08:18 AM IST | Updated: Nov 09, 2026, 08:22 AM IST
Image Credit: Airtel 1 Plus 1 Free Recharge Offer
Join

Airtel 1 Plus 1 Free Recharge Offer: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ మరోసారి తమ  సిమ్ కార్డు వినియోగదారులకు భారీ శుభవార్త అందించింది. చాలా రోజులుగా ఇనాక్టివ్గా ఉన్న సిమ్ కార్డు మీ దగ్గర ఉందా? అయితే ఇది మీకు నిజంగా బంపర్ శుభవార్తే. ఇనాక్టివ్ కస్టమర్లను మళ్లీ యాక్టివ్ చేసేందుకు ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మీరు రూ.349 లేదా రూ.399 తో రీఛార్జ్ చేస్తే, తదుపరి రీఛార్జ్ ఉచితంగా లభించే వన్ ప్లస్ వన్ రీఛార్జ్ ఆఫర్ ఇది. అంటే ఈ ప్లాన్లో ఒకసారి రీఛార్జ్ చేస్తే 28 రోజులకు బదులుగా 56 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా లభిస్తాయి. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. చాలా రోజులుగా రీఛార్జ్ చేయని వారి కోసమే ఈ ఆఫర్ తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఎయిర్‌టెల్ 1+1 ఆఫర్ ప్రయోజనాలు..
ఇనాక్టివ్గా ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు రూ.349 లేదా రూ.399 తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత లోకల్ ఎస్టీడీ కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు పొందుతారు. అదనంగా తదుపరి రీఛార్జ్ ఉచితంగా లభిస్తుంది. అంటే మొత్తం 56 రోజుల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌తో ప్రతిరోజు 2 జీబీ డేటా లభించడంతో పాటు, 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత డేటా కూడా పొందవచ్చు. ఇంకా, 12 నెలల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (విలువ రూ.4,000 రూపాయలు) ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఉచిత హలో ట్యూన్స్, ఎయిర్‌టెల్ థాంక్స్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఎయిర్‌టెల్ అందిస్తున్న రియల్ టైమ్ ఫ్రాడ్‌ కాల్‌ అలర్ట్, ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్ సేవలు కూడా మీరు పొందవచ్చు.

ఇక ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌తో అపరిమిత 5జీ, 4జీ డేటా పొందవచ్చు. ఇది కేవలం 5జీ ఫోన్లకే కాకుండా అన్ని ఫోన్లకు వర్తిస్తుంది. ఇందులో కూడా ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తుంది, అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి.

Read Also: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.279 లకే నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్‌స్క్రిప్షన్.. 30GB డేటా ఉచితం!

అయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ఓపెన్ చేసి "వన్ ప్లస్ వన్ రీఛార్జ్ ఫ్రీ" ఆప్షన్ను ఎంచుకోండి. అక్కడ రూ.349 లేదా రూ.399 ప్లాన్ కనిపిస్తే మీరు అర్హులు. ఆ ట్యాగ్ కనిపించకపోతే, మీరు ఈ ఆఫర్‌కు అర్హులు కారని అర్థం.
ఈ ప్లాన్ ఎన్ని రోజులపాటు అందుబాటులో ఉంటుందో ఎయిర్‌టెల్ ఇంకా ప్రకటించలేదు. ఈ ప్లాన్తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే మరో రీఛార్జ్ ఉచితంగా పొందవచ్చనే ట్యాగ్లైన్తో ఎయిర్‌టెల్ ఈ రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. చాలా రోజులుగా రీఛార్జ్ చేయని ఎయిర్‌టెల్ సిమ్ కార్డు యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఆఫర్ ఒకసారి మాత్రమే పొందవచ్చు, అలాగే రోజువారీ ఇంటర్నెట్ వినియోగంపై ఎలాంటి పరిమితీ లేదు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES