ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.279 లకే నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్‌స్క్రిప్షన్.. 30GB డేటా ఉచితం!
ఎయిర్‌టెల్ బంపర్ ప్లాన్స్ అందిస్తోంది, ఇవి అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ధరలోనే ఓటీటీ సేవలను కూడా అందిస్తోంది. అయితే ఈరోజు ఎయిర్‌టెల్ అద్భుతమైన 279 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో 30 జీబీ డేటా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క అభివృద్ధి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందాం.
Airtel Rs 279 Data Plan: మీకు ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ ఉంటే, కేవలం 279 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీకు నెలకు 30 జీబీ డేటాతో పాటు ఓటీటీ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. ప్రధానంగా నెట్ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్స్టార్, జీ5 ప్రీమియం వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్‌ను కూడా మీరు వీక్షించవచ్చు. ఇందులో మీరు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చూడవచ్చు. మొత్తం 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా పొందుతారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ ప్లాన్‌తో మీరు అదనంగా ఎలాంటి ఓటీటీ రీఛార్జ్‌లు చేసుకోకుండానే, 30 జీబీ డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్ వివరాలు..
ఈ ఎయిర్టెల్ 279 రీఛార్జ్ ప్లాన్ ఒక నెల పాటు వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం ఇందులో 30 జీబీ డేటా లభిస్తుంది. అంటే ప్రతిరోజు 1 జీబీ లేదా 2 జీబీ అనే పరిమితి లేదు; వ్యాలిడిటీ సమయంలో మీకు ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డేటా పరిమితి పూర్తయితే, ప్రతి ఎంబీకి 50 పైసల చొప్పున చార్జీ వర్తిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ బేసిక్..
ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ కూడా పొందుతారు. దీనితో మీరు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ఒరిజినల్ షోస్ చూడవచ్చు. ఇది కేవలం మొబైల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో, మీరు మొబైల్‌లోనే కంటెంట్‌ను వీక్షించవచ్చు.
ఇవే కాకుండా, ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో మొబైల్ గేమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
జియో హాట్స్టార్, జీ5 ప్రీమియం..
ఈ ప్లాన్‌లో కాంప్లిమెంటరీగా నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా జియో హాట్‌స్టార్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు స్పోర్ట్స్, సినిమాలు, హాట్‌స్టార్ స్పెషల్స్ చూడవచ్చు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మరో రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది, దీనిలో వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సినిమాలు చూడవచ్చు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లాన్..
ఈ ప్లాన్‌తో ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మొత్తం 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్‌ను చూడవచ్చు. సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, చౌపాల్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇందులో ఉన్నాయి. ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్‌తో ఇన్ని ప్రయోజనాలు లభించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.