SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.379 రీఛార్జ్‌తో వేల రూపాయల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు పూర్తిగా ఉచితం!

ఎయిర్‌టెల్ రూ.379 రీఛార్జ్ ప్లాన్ ఒక నెల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్లో ప్రతిరోజు మీరు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు. ఇందులో అదనంగా లభించే ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 22, 2026, 13:02 IST | Updated: Nov 22, 2026, 13:04 IST
Image Credit: Airtel Rs 379 Recharge Plan:
Join

Airtel Rs 379 Recharge Plan: ప్రైవేట్ రంగంలోని ఎయిర్‌టెల్ కంపెనీ ప్రతిరోజు ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాలింగ్ కోరుకునే వినియోగదారుల కోసం వివిధ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతేకాకుండా వారికి అదనంగా డిజిటల్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే నెల నుంచి ఏడాది వరకు వివిధ వ్యాలిడిటీలతో కూడిన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక నెల వ్యాలిడిటీతో పాటు 2 జీబీ డేటాను అందించే ఎయిర్‌టెల్ రూ.379 రీఛార్జ్ ప్లాన్ గురించి మీకు తెలుసా? ఇందులో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజు 2GB డేటా, వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఎస్ఎంఎస్ ప్యాక్లో బ్యాంకింగ్ , ఓటీపీ అలర్ట్లు కూడా అందుతాయి. ఈ ఎయిర్టెల్ ప్లాన్ ప్రతిరోజు మీ సిమ్ యాక్టివ్గా ఉండేలా చూస్తుంది. ఏ నెట్‌వర్కైనా ఉచితంగా కనెక్ట్ చేస్తుంది. అలాగే ఉచితంగా నేషనల్ రోమింగ్ కాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఇంకా ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో ప్రధాన ప్రయోజనం 5జీ డేటా. ఈ ప్లాన్లో మీరు రోజుకు 2GB డేటా పొందుతారు కాబట్టి 5జీ స్పీడ్లో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు 30 జీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది. అంటే ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లను మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ నిండిపోయిన తర్వాత ఈ క్లౌడ్ స్టోరేజ్ ఫోటోలు, వీడియోలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

యాపిల్ మ్యూజిక్, ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా ఈ ప్లాన్లో ఉచితంగా లభిస్తాయి. ఆపిల్ మ్యూజిక్ను ఆరు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇందులో 100 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి. 12 నెలల వ్యాలిడిటీతో ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను కూడా పొందవచ్చు. దీని ద్వారా సోషల్ మీడియా పోస్టులు, గ్రాఫిక్స్ డిజైన్లు, క్రియేటివ్ కంటెంట్ తయారు చేయడానికి సహాయం లభిస్తుంది. దీని విలువ సుమారు రూ.4000 కాగా, 12 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ ప్లాన్లో మీరు ఎయిర్‌టెల్ సేఫ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. దీని ద్వారా రియల్ టైమ్ స్పామ్ కాల్ అలర్ట్లు పొందవచ్చు, అనవసరమైన నంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఓటీపీ మోసాల నుంచి రక్షణ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆఫ్రికా హలో ట్యూన్స్ కూడా ఉచితంగా లభిస్తాయి, వీటి వ్యాలిడిటీ ఒక నెల పాటు ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES