ఆ 3 సూత్రాలు తెలిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు: అజిత్ దోవల్
Ajit Doval Success Tips: చాలామంది జీవితాల్లో స్పష్టత లేకపోవడం కారణంగా విజయం సాధించలేకపోతున్నారని.. మూడు సూత్రాలను పాటిస్తే తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రసంగించారు..
Ajit Doval Success Tips Telugu: మనుషుల జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగే ప్రయాణంలో స్పష్టత ఎంతో అవసరమని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడికి చేరుకోవాలి? ఆ గమ్యాన్ని ఎలా అందుకోవాలి? అనే మూడు ప్రాథమిక సూత్రాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన కెరీర్ మొదటి రోజుల్లో నేర్చుకున్న ఓ విలువైన జీవిత పాఠాన్ని వారితో పంచుకున్నారు..
తన వృత్తి జీవితంలో ఎదురైన మానసిక సంఘర్షణను దోవల్ విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.. ఎన్నో ఉన్నతమైన ఆశలతో పాటు ఆశయాలతో కెరీర్ను మొదలు పెట్టారని.. కొత్తలో అన్ని ప్రతికూలంగా మారినట్లు అనిపించింద.. తీవ్ర నిరాశ తనను చుట్టుముట్టిందని.. ఆ సమయంలో తనతో కలిసి పనిచేస్తున్న ఓ టిబెటన్ షెర్పా తన బాధను గమనించి.. సార్ ఎందుకు అంత దిగులుగా ఉన్నారు? అని ఆరా తీశారన్నారు.. కెరీర్లో తను ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు క్లిష్ట పరిస్థితుల గురించి ఆయనకు చెప్పానని అజిత్ దోవల్ గుర్తు చేసుకున్నారు..
తన సమస్యలను విన్న ఆ షెర్పా ఇచ్చిన సమాధానం తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని దోవల్ తెలిపారు. జీవితమంతా మంచి పర్వతాల్లో విధులు నిర్వహించిన ఆ వృద్ధ అధికారి.. ఇదంతా కేవలం మ్యాప్ రీడింగ్ వ్యవహారం మాత్రమేనని చెప్పారని ఆయన అన్నారు. జీవితంలో విజయవంతం కావడానికి మూడు విషయాలపై పూర్తిగా అవగాహన ఉండాలని ఆయన సూచించారన్నారు..
మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో? మీ బలా బలహీనతలు ఏమిటో స్పష్టంగా గుర్తించడం.. మీరు ఎక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నారు.. మీ అంతిమ లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవడం.. ప్రస్తుతం మీ స్థానం నుంచి ఆ గమ్యస్థానానికి చేరుకోవడానికి సరైన దారిని ఎంచుకోవడం.. అనే మూడు అంశాలపై స్పష్టత ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుతారని ఆయన అన్నారు. జీవితాన్ని ఒక మ్యాపుల భావిస్తే.. చాలామంది తమ మ్యాప్ రీడింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకొని ముందుకు తాగుతారని.. మరికొందరు దిశా నిర్దేశం లేక గందరగోళానికి గురవుతారని దోవల్ విద్యార్థులకు హితవు పలికారు.. సవాళ్లు ఎదురైనప్పుడు అసలు అధైర్య పడకుండా పరిస్థితిని విశ్లేషించుకొని అడుగులు వేయాలని IIT స్టూడెంట్స్‌కి దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..