Prabhas Birthday Surprise: ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు జరుపుకోనున్నారు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి సినిమాల నుంచి కొత్త పోస్టర్లు, గ్లింప్స్ లేదా ఇతర అప్‌డేట్స్ వస్తుంటాయి. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాల నుంచి సర్‌ప్రైజ్‌లు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాను ముందుగా డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆ తేదీకి విడుదల సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదనే టాక్ ఉంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ హైప్ ఉంది. సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ పోస్టర్ లేదా ప్రత్యేక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2 కూడా కీలకమైన ప్రాజెక్ట్. 'కల్కి 2898 AD'కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కనుంది. సీక్వెల్ పనులు అక్టోబర్‌లో మరింత ముందుకు వెళ్లనున్నట్లు ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
దీంతో అక్టోబర్ 23న ఫౌజీ గ్లింప్స్, స్పిరిట్ అప్‌డేట్, కల్కి 2కు సంబంధించిన ప్రకటన వస్తే ప్రభాస్ అభిమానులకు ఇది ట్రిపుల్ ట్రీట్ అవుతుంది. అయితే ఈ మూడు అప్‌డేట్లపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ప్రభాస్ బర్త్‌డే దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాల నుంచి ఏ సర్‌ప్రైజ్ వస్తుందనే ఆసక్తి పెరుగుతోంది. అధికారిక ప్రకటన కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..
Also Read: అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..