SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amazon సేల్ ధమాకా.. Samsung Galaxy S25 Ultra 5G పై రూ.51,500 భారీ డిస్కౌంట్!

Samsung Galaxy S25 Ultra 5g: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యంత చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై భారీ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 02:19 PM IST | Updated: Oct 08, 2026, 02:22 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Samsung Galaxy S25 Ultra 5g: పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రైమ్ వినియోగదారులకు ఈ రోజు నుంచి సేల్‌ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులోకి వచ్చాయి.. ముఖ్యంగా సాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్ మోడల్  గెలాక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) స్మార్ట్‌ఫోన్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్‌లో ఫోన్‌పై ఏకంగా రూ. 51,500 కంటే ఎక్కువ తగ్గింపును అమెజాన్ అందించడం విశేషం. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాంసంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా 5G బేస్ వేరియంట్ ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 1,29,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుత ఫెస్టివల్ సేల్ ఆఫర్ల కింద.. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరపై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌ ఆఫర్‌తో పాటు కూపన్లు కలుపుకుని రూ.51,500 వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ రూ.78,499 నుంచి రూ. 84,999 లోపే అందుబాటులో ఉంది.. అయితే, దీనిపై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి మరింత చీప్‌ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్‌ వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆక్టా-కోర్  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది.. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో వెనక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది.. దీంతో అల్ట్రా-వైడ్ నుంచి టెలిఫోటో షాట్ల వరకు అద్భుతమైన క్లారిటీ అందిస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే ఎక్కువ సమయం ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించేందుకు ఇందులో 5,000mAh బ్యాటరీని అందిస్తోంది..

అంతేకాకుండా ఇది చాలా తక్కువ బరువు 218 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఇది 8.2 మి.మీ స్లిమ్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. దీని డిజైన్‌ కూడా ఎంతో అద్భుతంగా ఉండడం మీరు చూడొచ్చు. అలాగే ఇది ఎన్నో రకాల కలర్‌ ఆప్షన్స్‌లో కూడా లభిస్తోంది. అయితే, ఇందులో రోజువారీ పనులను మరింత సులభతరం చేసేందుకు గెలాక్సీ AI (Galaxy AI) ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన ఎస్-పెన్ (S Pen) సపోర్ట్ ఇందులో అందుబాటులో ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES