SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: రన్నింగ్ ట్రైన్‌లో దీపం పెట్టి, అయ్యప్ప భక్తుడి శంఖారావం.. వీడియో వైరల్..

Ayyappa devotee video viral: రన్నింగ్ ట్రైన్ లో అయ్యప్ప భక్తుడుస్వామి వారి భక్తుడు కోచ్ లో దీపంపెట్టుకుని, శంఖారావం చేసి పూజ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 26, 2026, 12:59 IST | Updated: Nov 26, 2026, 13:05 IST
Image Credit: ayyappa devotee puja in running train video
Join

Ayyappa swamy devotee perform puja in running train: సోషల్ మీడియాలో ఇటీవల అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకు ఎక్కడ ఎలాంటి ఆసక్తికర ఘటనలు లేదా షాకింగ్ కు గురిచేసే ఘటనలు జరిగిన కూడా వెంటనే వాటిని రికార్డు చేసి వైరల్ చేస్తారు. ఈ క్రమంలో ఇటీవల చాలా మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రైన్ లలో వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని ఇండియన్ రైల్వేస్ ఇటీవల సైతం సీరియస్ అయ్యింది. 

 

 

ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక అయ్యప్ప స్వామి భక్తుడు రన్నింగ్ ట్రైన్ లో  శంఖారావం మోగించడం, స్వామివారి ఫోటోను పెట్టుకుని కోచ్ లో పూజలు చేయడంకు చెందిన వీడియో వైరల్ గా మారింది. రన్నింగ్ ట్రైన్ లో  ఒక అయ్యప్పస్వామి మాలవేసుకున్న భక్తుడు ఎక్కాడు. అతను కోచ్ లో అయ్యప్ప స్వామి ఫోటోను పెట్టుకుని పూజలు చేశాడు. అంతే కాకుండా  శంఖారావం కూడాచేశాడు. 

ఆ తర్వాత  తన పూజలో, భక్తితో నిమగ్నమయ్యాడు. దీంతో ఈ ఘటనను కొంత మంది సీక్రెట్ గా వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భక్తి ఉండవచ్చు కానీ.. తమ భక్తితో ఇతరులను ప్రమాదాల్లో నెట్టొద్దని చెబుతున్నారు. ఏదైన జరిగితే నిముషాల వ్యవధిలోనే  ట్రైన్ అంతా కాలి పోతుందని,  అందరి  ప్రాణాలు ప్రమాదాల్లో పడుతాయని  నెటిజన్ లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES