• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

Sampath Nandi On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి దర్శకుడు సంపత్ నంది తప్పుకోవడానికి కారణమేంటో వెల్లడించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో మరో సినిమా చేసుకునేందుకు పరస్పర అంగీకారంతో ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం మధుర జ్ఞాపకమని స్పష్టం చేశారు.

Written ByHarish Darla
Published: Nov 26, 2026, 13:00 IST|Updated: Nov 26, 2026, 13:08 IST
joinshare
Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

2

Video Viral: రన్నింగ్ ట్రైన్‌లో దీపం పెట్టి, అయ్యప్ప భక్తుడి శంఖారావం.. వీడియో వైరల్..

3

పర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్ ఎందుకు కలుపుతారో తెలుసా?

4

Mumbai Indians New Captain: ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు? రోహిత్ రీఎంట్రీపై సీక్రెట్ పోస్ట్‌తో హింట్!

5

ఒకే యువతిని ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు.. వింత ఆచారం ఎక్కడో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sampath Nandi On Pawan Kalyan: టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కాల్సి ఉందనే విషయం అప్పట్లో అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి సంపత్ నంది తప్పుకోవడం, ఆ తర్వాత సినిమాకు దర్శకుడిగా బాబీ కొల్లి బాధ్యతలు చేపట్టడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సంపత్ నంది స్పందించి అసలు కారణాన్ని వెల్లడించారు.

తన తాజా సినిమా 'భోగి' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపత్ నంది 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా గురించి మాట్లాడారు. మొదట ఈ చిత్రానికి తానే దర్శకుడిగా ఎంపికయ్యానని, కానీ పవన్ కల్యాణ్ ఇతర సినిమాలు, కమిట్‌మెంట్ల కారణంగా షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యమైందని చెప్పారు. సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా తనను పిలిచి మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో సినిమా ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాలా? లేదా ఈ విరామంలో మరో సినిమా చేసుకోవచ్చా? అనే విషయాన్ని పవన్ తనకు అడిగారని సంపత్ నంది తెలిపారు. తాను ఈ సమయంలో మరో ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని పవన్‌ను అడిగినట్లు చెప్పారు. దీనికి ఆయన అంగీకరించడంతో ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండానే సినిమా నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన ఎప్పుడూ ఇతరులను ఎక్కువకాలం వేచి ఉండేలా చేయడానికి ఇష్టపడరని సంపత్ నంది వివరించారు. తనతో సినిమా చేయాలని పవన్ చివరి వరకు ప్రయత్నించారని తర్వాత నిర్మాతల ద్వారా తెలుసుకున్నానని కూడా వెల్లడించారు.

ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్, సంపత్ నంది కలిసి సినిమా చేయకపోయినా ఆ సమయంలో తమ మధ్య జరిగిన చర్చలు స్నేహపూర్వకంగానే ముగిశాయని దర్శకుడు తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. ఈ వివరణతో అప్పట్లో వినిపించిన విభేదాల ప్రచారానికి తెరపడినట్లయింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News