SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జూలో పాండాల ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్!

Baby Falls Into Panda Enclosure Video: జూలోని పాండాలు ఉన్న ఎన్‌క్లోజర్ లోపలికి ఓ చిన్నారి పడిపోయింది. ఈ సమయంలో అందరూ బయపడి పోయారు. అయితే, ఈ పాపను పాండాలు ఏం చేశాయి? దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 03:17 PM IST | Updated: Nov 14, 2026, 03:19 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Baby Falls Into Panda Enclosure Video: సాధారణంగా జూ వెళ్లినప్పుడు జంతువులను చాలా దగ్గరగా చూడాలనే ఆసక్తి పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఎక్కువే ఉంటుంది.. అయితే, ఆ ఉత్సాహంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి.. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి.. తాజాగా ఒక జూలో జరిగిన ఇలాంటి ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. పసుపు రంగు దుస్తులు ధరించిన.. ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ పాండాలు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి జారిపడిన దృశ్యం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. జూలోని జంతువులు చూడడానికి వచ్చిన ఆ చిన్నారి పాండాలను చూస్తుండగా  ఒక్కసారిగా అదుపుతప్పి ఎన్‌క్లోజర్ లోపలికి పడిపోయిందట.. పాండాలు చూడటానికి ఎంతో ముద్దుగా.. ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. అవి అడవి జంతువులు కాబట్టి.. భయంతోనో లేదా ఆగ్రహంతోనో దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.. దీంతో చిన్నారి కింద పడగానే అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారట.. ఏం జరుగుతుందోనని అంతా ఊపిరి బిగపట్టి చూస్తుండగా.. అక్కడ ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన ఘటన జరిగింది..

చిన్నారి కింద పడటాన్ని గమనించిన రెండు పాండాలు వెంటనే ఆమె వైపు నడుచుకుంటూ వెళ్లడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. అక్కడున్న అందరూ ఆ పాండాలు చిన్నారిపై దాడి చేస్తాయేమోనని భయపడిపోయారు.. కానీ.. ఆశ్చర్యకరంగా ఆ రెండు పాండాలు చిన్నారికి ఎలాంటి హాని చేయలేకుండా ఉండిపోయాయి.. ఆమెను ఎంతో జాగ్రత్తగా పైకి లేపి.. తిరిగి గోడ వద్ద ఉన్న మనుషుల వైపు సురక్షితంగా అందించినట్లు ఆ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు.. ఒక చిన్నారి పట్ల ఆ మూగజీవాలు చూపిన ప్రేమ.. ఆప్యాయత అక్కడున్న వారిని మాత్రమే కాకుండా.. వీడియో చూస్తున్న కోట్లాది మంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది..

ఈ వీడియో ఇప్పుడు ఎక్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. మనుషుల కంటే జంతువులకే మానవత్వం ఎక్కువగా ఉంది.. అంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం పాండాలు ఆ చిన్నారిని అంత పైకి ఎత్తి మనుషులకు అందించడం చూస్తుంటే.. ఇది తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినట్లే ఉందని భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో అన్ని సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES