SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: పెట్రోల్ తాగుతూ రీల్స్ చేసిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్.. వీడియో వైరల్..

Bihar man drinking petrol: రీల్స్ పిచ్చిలో పడి సదరు వ్యక్తి రీల్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొవద్దని చెబుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 23, 2026, 08:44 AM IST | Updated: Oct 23, 2026, 08:58 AM IST
Image Credit: Bihar man drink petrol video
Join

Bihar man drinks petrol for social media reels video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వులు తెప్పించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగాను ఉంటాయి. చాలా మంది సోషల్ మీడియాలో లైక్ లు, వ్యూస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఎంతటి రిస్క్ చేయడానికి సైతం వెనుకాడదు. ఈ క్రమంలో కొంత మంది ఎత్తైన కొండలు, నదులు, సముద్రాలు మొదలైన చోట్ల  వెళ్లి రీల్స్ చేస్తున్నారు. ప్రమాదకర క్రూర జంతువుల వద్ద కూడా వెళ్లి రీల్స్ చేస్తున్నారు. 

 

 

ఇలాంటి క్రమంలో తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టుకుని మరీ రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రన్నింగ్ వాహనాల్లో, తప్పతాగి, పబ్లిక్ ప్రదేశాలు మొదలైన చోట రీల్స్ చేస్తున్నారు. ఏది చూసిన కూడా ఫెమస్ కావాలని చూస్తున్నారు. మొత్తంగా ఈ రీల్స్ పిచ్చి వాలన కొన్నిసార్లు ఇతరులు కూడా డెంజర్ లో పడుతున్నారు. తాజాగా.. ఒక వ్యక్తి బీహర్ లో  రీల్స్ పిచ్చిలోఏకంగా పెట్రోల్ తాగుతూ హల్ చల్ చేశాడు. ఈ వీడియోపై నెట్టింట దుమారం చెలరేగింది.


బీహర్లో ఒక వ్యక్తి రీల్స్ పిచ్చిలో పెట్రోల్ బంకుకు వెళ్లాడు. రాత్రికి రాత్రే ఎలాగైన ఫెమస్ అవ్వాలని ప్లాన్ చేశాడు.  పెట్రోల్ పోసే వ్యక్తి వద్దకు వెళ్లి తన చేతిలో పెట్రోల్ పోయమన్నారు. మరీ దానికి అతను ఎలా అంగీకరించాడో కానీ చేతిలో పెట్రోల్ పోస్తుంటే తాగుతున్నట్లు  ఫోజులిచ్చాడు.  అచ్చం నీళ్లు తాగినట్లు పెట్రోల్ ను తన చేతిదోసిట్లో పడుతుంటేనోట్లో తీసుకున్నాడు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసుకున్నారు. 

మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. కొంత మంది మాత్రం పెట్రోల్ విషపూరితమైందని, శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని కామెంట్స్  చేస్తున్నారు.  రీల్స్ మోజులో ఇలాంటి ప్రమాదకర స్టంట్లతో ప్రాణాలను పణంగా పెట్టొద్దంటూ సూచిస్తున్నారు. మరికొంత మంది అసలు పెట్రోల్ బంక్ వ్యక్తి ఏవిధంగా రీల్స్ తీస్తుంటే పెట్రోల్ పోస్తున్నాడని, తొలుత అతనిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES