SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చైనా LED లైట్ల దెబ్బకు కుమ్మరుల బతుకులు ఆగమాగం.. దీపావళి వేళా ఆకలి కేకలు!

Traditional Diya: చైనా LED లైట్ల కారణంగా ప్రమిదలు చేసే కుమ్మరులు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల బేరాలు లేకపోవడంతో ఆకలి కేకలతో పోరాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు స్థానిక చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఇళ్లలో దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలు వెలిగించాల్సి అవసరం ఎంతగానో ఉంది..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 12:24 PM IST | Updated: Nov 07, 2026, 12:26 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Traditional Diya News: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటూ ఉంటాయి. కానీ.. ఆ వెలుగుల వెనుక తరతరాలుగా మట్టిని నమ్ముకుని బతుకుతున్న కుమ్మరుల జీవితాల్లో మాత్రం చీకట్లు తొలగిపోవడం లేదు.. ఒకప్పుడు దీపావళి వచ్చిందంటే చేతినిండా పని.. ఇంట్లో పండుగ సందడి ఉండిలో ఆనందానికి అవదులు లేకుండా పోయేవి.. ఇప్పుడు చీప్‌ ధరల్లో లభించే.. చైనా LED లైట్లతో పాటు ప్లాస్టిక్ దీపాల విపరీత విక్రయాలకు సాంప్రదాయ మట్టి ప్రమిదల విక్రయాలు ఊహించని స్థాయిలో పడిపోవడంతో ఈ చేతివృత్తిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ వస్తున్నాయి.

పండుగకు నెల రోజుల ముందు నుంచే కుమ్మరి కుటుంబాలు చక్రం తిప్పడం మొదలు పెడుతాయి. సరైన బంకమట్టిని సేకరించడంతో పాటు దానిని మెత్తగా పిసికి ఆకృతి తేవడం.. ఎండబెట్టి బట్టీల్లో కాల్చడం వరకు ప్రతి పనీ ఎంతో శ్రమతో కూడుకుని ఉంటుంది.. కట్టెల ధరలతో పాటు విపరీతంగా రవాణా ఖర్చులు, బంకమట్టి కొనుగోలు వ్యయం భారీగా పెరిగినా.. తయారుచేసిన ప్రమిదలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేకుండా పోయింది.. రూ.50కి 10 లేదా 20 ప్రమిదలు అమ్ముకోవడానికే.. వినియోగదారులు బేరసారాలు ఆడే పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు దళారుల ప్రమేయం వల్ల శ్రమించిన కళాకారుడికి దక్కేది అరకొర మాత్రమే కాగా.. లాభమంతా మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తూ వస్తోంది..

స్విచ్ వేస్తే.. చాలు రంగురంగుల కాంతులు చిమ్మే LED బల్పుబుల సరాలు, చైనా బల్బులతో పాటు ప్లాస్టిక్ డెకరేటివ్ దీపాలు ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. నూనె పోసి, వత్తి వేసి దీపం వెలిగించే.. శ్రమ తప్పుతుందన్న భావనతో చాలామంది పట్టణ ప్రజలు ఆధునిక లైట్ల వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు.. ఫలితంగా మన సంస్కృతితో పాటు పర్యావరణానికి మేలు చేసే సహజసిద్ధమైన మట్టి ప్రమిదలు వెలవెలబోతూ వస్తున్నాయి.. మా చేతులతో మట్టిని పిసికి ప్రాణం పోస్తాం.. కానీ ఆ వెలుగులు కొనే నాథుడే కరువయ్యాడు.. అని స్థానిక కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆదరణ కరవై.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో నేటి యువత ఈ వృత్తి వైపు చూడటం పూర్తిగా మానేస్తూ వస్తున్నారు.

పర్యావరణహితమైన జీవన విధానాన్ని ప్రోత్సహించి.. మట్టి కళాకారులను ఆదుకోవాల్సి అవసరం ఎంతగానో ఉంది. ప్రభుత్వం కుమ్మరులకు ఉచితంగా లేదా రాయితీపై బంకమట్టిని అందించడంతో పాటు ఎలక్ట్రిక్ వీల్స్ పంపిణీ చేయడం, మునిసిపల్ మార్కెట్లలో ఉచితంగా స్టాళ్లను కేటాయించడం వంటి చర్యలు చేపట్టాల్సి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా.. ప్రజలు కూడా తమ ఇళ్లలో కనీసం కొన్ని సాంప్రదాయ మట్టి ప్రమిదలనైనా వెలిగించి.. స్థానిక చేతివృత్తుల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది.. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES