Janasena Candidate garapati divya wins in mptc elections: ఆంధ్ర ప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఫలితాల హీట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో కూటమి భారీ స్థానాల్ని ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పరిషన్ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున గారపాటి దివ్య పోటీ చేశారు. అయతే నిన్న గుండెపోటుతో దివ్య కుప్పకూలీపోయారు.
ఆస్పత్రికి తరలించే లోపు ఆమె మరణించారని వైద్యులు ప్రకటించారు. మరోవైపు పరిషత్ ఎన్నికల్లో నిన్న మరణించిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, ధుమంతుని గూడెం ఎంపీటీసీ స్థానం బరిలో నిలిచిన దివ్య నిన్న కన్నుమూశారు. తన ప్రత్యర్థిపై దివ్య 352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దివ్య తనను గెలిపించాలని ఎంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు తానున్నానని భరోసా ఇచ్చారు.
గెలిస్తే తన ప్రజలకు ఏవిధంగా మంచి చేస్తానో కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ ఎంపీటీసీ అభ్యర్థిమరణం తర్వాత గెలవడంపై ప్రజలు సైతం తీవ్ర భావొద్వేగంకు గురౌతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. గారపాటి దివ్యకు ఇద్దరు సంతానం. ఒకవైప తమ అభ్యర్థి విజయం మరోవైపు ఆమె లేరనే విషాదంతో ధుమంతుని గూడెంలో గ్రామప్రజలు ఎమోషనల్ అవుతున్నారు.