SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. iPhone 17 నుంచి QLED TV వరకు భారీ డిస్కౌంట్లు!

Big Billion Days Sale 2026: బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌లో భాగంగా ఆఫర్స్‌ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అయితే, కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు టీవీలు చాలా చీప్‌ ధరలకే లభించబోతున్నాయి. అయితే, ఎర్లీ యాక్సెస్‌ ఉన్నవారికి ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 02:25 PM IST | Updated: Oct 07, 2026, 02:27 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Big Billion Days Sale 2026 Telugu News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారుల కోసం బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌ను త్వరలోనే ప్రారంభించబోతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అక్టోబర్ 9వ తేదిన ఈ సేల్‌ను ప్రారంభించబోతోంది. అయితే, ఈ 8వ తేది నుంచే ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ కస్టమర్స్‌తో పాటు ప్లస్ కస్టమర్స్‌కి ఈ సేల్‌ మొదలవుతుంది.. ఈ సేల్‌లో భాగంగా ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. ఆఫర్ల టీజర్లను సంస్థ అధికారిక యాప్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపులు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా వేటిపై స్పెషల్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ కలిగిన వినియోగదారులకు ఈ సేల్‌లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందే ఎర్లీ యాక్సెస్ ద్వారా సేల్‌ను ప్రారంభించే అవకాశం లభిస్తోంది. దీంతో పాటు, బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఇన్‌స్టంట్‌గా 15 శాతం తగ్గింపు లభించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం వీరి కోసమే ప్రత్యేకమైన ప్లస్ డీల్స్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా 10 శాతం అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉండడం విశేషం..

టాప్ డీల్స్ వివరాలు..
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో వెల్లడించిన డీల్స్‌లో భాగంగా.. ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభించబోతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐఫోన్ 17 మొబైల్‌ రూ.79,999తో ఈ సేల్‌లో భాగంగా అందుబాటులోకి రాబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది..  అంతేకాకుండా సాంసంగ్ గెలాక్సీ S25 ఫ్లాగ్‌షిప్ మోడల్  రూ.57,999కే లభించడం చాలా విశేషం.. ఇక బడ్జెట్ విభాగంలో అందుబాటులోకి ఒప్పో K14x స్మార్ట్‌ఫోన్ రూ.16,999లో అందుబాటులోకి రాబోతోంది.. ఇక ఇదే సేల్స్‌లో భాగంగా టీసీఎల్ 65 అంగుళాల QLED టీవీ కేవలం రూ.39,999 ధరతో మాత్రమే లభించబోతోంది.

ఈ భారీ సేల్ బుధవారం రాత్రి అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రాబోతోంది. వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను ఇప్పటి నుంచే విష్‌లిస్ట్‌లో చేర్చుకోవాలని ఫ్లిప్‌కార్ట్ సూచిస్తోంది. అయితే, సేల్‌ ప్రారంభంలో అనేక సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సేల్‌ ప్రారంభమైన గంట తర్వాత కొనుగోలు చేయడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్స్‌పై అదనంగా బారీ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభించబోతున్నాయి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES