• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'

Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'

Deshapati Srinivas Compares Revanth Reddy Govt Like Paradise Movie: రేవంత్ రెడ్డి పాలన ప్యారడైజ్‌ సినిమాలో సవారీలు, మాలిక్‌ మాదిరి ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ విమర్శించారు. రేవంత్‌ రెడ్డి చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయమని ప్రకటించారు. ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 03:03 PM IST|Updated: Oct 07, 2026, 03:11 PM IST
joinshare
Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'
Image Credit: Source: Deshapathi Srinivas Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.

Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.

2

అమెజాన్‌లో రూ.13,999కే స్మార్ట్‌ఫోన్.. Samsung, OnePlus, iQOO, Redmi ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

3

SIR Election Controversy: ఓటర్ల జాబితా సవరణపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ..అసలేం జరుగుతోంది?

4

Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'

5

Bandi Sanjay: ఓటు, సీటు చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్‌కే.!.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BRS Party: 'రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల బతుకులు ప్యారడైజ్ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా మారాయి. తెలంగాణలో నీరో రాజ్యం కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై నిరంతరం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. 'ఢిల్లీకి సూట్‌కేసులు ప్రతిపక్షంపై కేసులు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. పోలీసులు ప్రతిపక్ష నాయకుల ఇళ్ల వద్ద బందీలుగా మారారు. కాంగ్రెస్ నాయకుల బౌన్సర్లలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు' అని విమర్శించారు.

శాసనమండలి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ రాష్ట్రంలో బరితెగింపు పాలన నడుస్తోంది. రాహుల్ గాంధీ ఢిల్లీలో బారికేడ్లు ఎక్కి నిరసన చేస్తున్నారు. ఢిల్లీలో బడే భాయ్ మోదీ కేసులు పెట్టలేదు. ఇక్కడ చోటే భాయ్ కేడీ అరెస్టులు చేస్తున్నారు. మెడికవర్ హాస్పిటల్ ముందు ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? బ్యూరోక్రాట్ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేస్తారా?' అని బీఆర్ఎస్ పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

'తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా? లేని రంకులు అంటగట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా? మూడేళ్లలో కాంగ్రెస్ చేసిన ఘనత శూన్యం. ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్బంధాలు కొనసాగిస్తోంది. కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తోందని కొంతమంది మేధావులు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏమైనా పాలంకుశ పాలన నడుస్తోందా?' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ నిలదీశారు.

'రేవంత్ రెడ్డికి సమయం దగ్గర పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా, హోంమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా ఫెయిల్‌' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. 'కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న తన అనుయాయులను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను రద్దు చేశారు. ప్రజలకు రీ కాల్ చేసే హక్కు ఉంటే ఈపాటికే రేవంత్ రెడ్డిని చెత్తబుట్టలో పడేసేవారు. రేవంత్ రెడ్డిని చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయం' అని పేర్కొన్నారు.

'సద్భుద్దిని రేవంత్‌ రెడ్డికి దేవుడు ప్రసాదించాలి. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లాంటి దోహుల వల్లే యువత బలిదానాలు జరిగాయి. రేవంత్ రెడ్డి పేరు రాసి మరీ కొందరు ఆత్మాహుతి చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి అమరుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది?' అని శాసనమండలి బీఆర్ఎస్ పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు అని నిలదీశారు. అమరవీరులకు, దళితులకు తగాదా పెట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో నువ్వు  అంటున్న ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు అని రేవంత్ రెడ్డికి శాసనమండలి బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
Telugu News
Telangana News
Hyderabad