SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

లక్షల్లో జీతం.. ఉన్నత హోదా.. అయినా వదిలేశారు! Ex CBI ఆఫీసర్‌ సన్యాసిగా ఎందుకు మారారంటే?

Viral News: సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన ఓ వ్యక్తి సడన్‌గా సాదువులా మారిపోయారు. ఉద్యోగానికి బైబై చెప్పి.. మానసిక ప్రశాంతత కోసం నర్మదా తీరంలో ఒక గుహలో జీవిస్తున్నారు. అయితే, ఇతనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 13:49 IST | Updated: Nov 24, 2026, 13:51 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Viral News: ప్రస్తుతం ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే యువత ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక సీబీఐ వంటి ప్రభుత్వ సంస్థంలో ఇన్‌స్పెక్టర్ స్థాయి హోదా.. లక్షల్లో జీతం, ప్రభుత్వ వసతి, సమాజంలో అద్బుతమైన గౌరవం లభిస్తే ఎవరైనా వద్దు అని అనుకుంటారా? కానీ.. ఓ విద్యావంతుడు మాత్రం వీటన్నింటినీ కాదనుకున్నారు.. అధికారిక హోదా కంటే మనశ్శాంతే ముఖ్యమని భావించి.. నర్మదా నదీ తీరంలోని దట్టమైన అడవిలో ఓ గుహను తన నివాసంగా మార్చుకున్నారు ఒక వ్యక్తి.. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆయన ఎన్నో గొప్ప చదువులు చదువుకున్నారు. ఆయన బీఎస్సీ పూర్తి చేయడంతో పాటు హోమియోపతిలో MD పట్టా కూడా పొందరాట.. చిన్నప్పటి నుంచి కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడి చదివి.. సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారట.. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎంతో ఉత్సాహంగా పనిచేసినప్పటికీ.. రోజులు మారుతున్న కొద్దీ.. ఆ జీవితంలో ఆయనకు ఎక్కడో ఖాళీ మొదలైందట..

అయితే, ఉద్యోగ విరమణకు ముందే సన్యాసం స్వీకరించడానికి గల కారణాన్ని ఆయన ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..  ఒక సాధారణ గొర్రెల కాపరి ఎంతో ప్రేమతో నా దగ్గరకు వచ్చి మాట్లాడాలని.. పక్కన కూర్చోవాలని ఆశపడినా.. నా పదవి.. హోదా అందుకు అడ్డుగా నిలిచేవి.. ఆ దూరం నన్ను తీవ్రంగా కలచివేసింది.. అని ఆయన ఈ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేయడం మీరు గమనించవచ్చు..

పదవి తెచ్చే.. గౌరవం కంటే స్వేచ్ఛ, ఆత్మశాంతి ముఖ్యమని నిర్ణయించుకున్న ఆయన.. సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆధ్యాత్మిక బాట పట్టారట.. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత.. పవిత్ర నర్మదా నదీ తీరానికి చేరుకున్నారట.. ముందుగా ఒక కొండపై ఉన్న ఆలయంలో దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఉన్నారట.. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా సమీప గ్రామాలకు సంబంధించిన పేద పిల్లలకు చదువు చెప్పారట..

ప్రస్తుతం ఆయన నర్మదా తీరంలోని ఉన్న అటవీ ప్రాంతంలోని గుహలో అత్యంత సాదాసీదా జీవితాన్ని గడుపుతూ వస్తున్నారట.. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలకు దూరంగా.. స్వయంగా కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ.. ప్రకృతిలో ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తున్నారట.. బంధాలు, కోరికలు, ఆస్తులతో పాటు అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన ఈ మాజీ సీబీఐ అధికారికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES