SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆధార్‌కు ఈమెయిల్ ఐడీని ఉచితంగా ఎలా లింక్ చేయాలి? డిసెంబర్ 31లోపు మొబైల్‌లోనే ఇలా చేసేయండి!

భారతదేశంలో ఆధార్ కార్డు ఒక అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇది ప్రతి పౌరుడి వద్ద ఉండాల్సిందే. ఇందులో వారి బయోమెట్రిక్ వివరాలు పొందుపరచి ఉంటాయి. స్కూల్ అడ్మిషన్ల నుండి సిమ్ కార్డు కొనుగోలు వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, డిసెంబర్ 31వ తేదీ లోపు మీ ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 13, 2026, 08:14 AM IST | Updated: Oct 13, 2026, 08:21 AM IST
Image Credit: Aadhaar Email ID Update
Join

Aadhaar Email ID Update: ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తి గుర్తింపు కార్డు. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్నా లేదా స్కూల్, కాలేజీ అడ్మిషన్లు, చివరికి సిమ్ కార్డుల కొనుగోలు వంటి పనులకైనా ఆధార్ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఆధార్‌లో ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్‌తో పాటు ఈమెయిల్ ఐడీ కూడా అప్‌డేట్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఈమెయిల్ ఐడీని డిసెంబర్ 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును UIDAI కల్పించింది.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకారం.. ఆధార్ కార్డుదారులు తమ ఈమెయిల్ ఐడీని ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ అప్‌డేట్ కోసం రూ.75 నామమాత్రపు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ సేవను ఉచితంగా అందిస్తున్నారు. మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని స్మార్ట్‌ఫోన్ లేదా లాప్ టాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

అయితే, UIDAI సూచనల మేరకు కేవలం అధికారిక ఆధార్ యాప్ ద్వారా మాత్రమే అప్‌డేట్ చేయండి. మొదటగా ప్లే స్టోర్ నుండి ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా చేయవచ్చు. తెలియని వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా లింక్‌లను నమ్మకండి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మోసపోకుండా ఉండటానికి ఏదైనా డౌన్‌లోడ్ చేసే ముందు యూఆర్ఎల్ సరిచూసుకోండి.

Read Also: ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వార్నింగ్! హ్యాండ్ లగేజ్‌లో పొరపాటున కూడా ఈ 10 వస్తువులు పెట్టకండి.. జైలు లేదా ఫైన్ తప్పదు!
 

ఆధార్ యాప్‌లో ఈమెయిల్ అప్‌డేట్ చేసే విధానం..
మీ ఆధార్ కార్డుపై ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవడానికి, మొదట యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మీ ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి. అప్పుడు మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది, దానితో వెరిఫై చేయండి. అనంతరం 'ప్రొసీడ్ అండ్ అప్‌డేట్ ఈమెయిల్ ఐడీ' ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వివరాలను ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ ఉంటుంది. మీ వివరాలను ఒకసారి సరిచూసుకుని సబ్మిట్ చేయండి. దీని తర్వాత మీ అప్డేట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

 

సాధారణంగా ఈ సేవలకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ UIDAI డిసెంబర్ 31వ తేదీ వరకు ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కూడా X వేదికగా షేర్ చేసింది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా గడువులోపు అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రమే ఉచితం. ఒకవేళ మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్తే మాత్రం అక్కడ నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES