SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మార్కెట్‌లోకి Infinix, Tecno కొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Upcoming Smartphones 2026: త్వరలోనే మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్, టెక్నో స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. వీటిని కంపెనీ చాలా తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ యూరోపియన్ ఎకనామిక్ కమిషన్ డేటాబేస్‌లో కూడా కనిపించాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 12:03 PM IST | Updated: Nov 11, 2026, 12:04 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Upcoming Smartphones 2026: త్వరలోనే మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. ప్రముఖ చైనీస్‌ బ్రాండ్లు  ఇన్‌ఫినిక్స్, టెక్నో గ్లోబల్ మార్కెట్‌ను దృష్టి పెట్టుకుని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 30e 5G మొబైల్‌లో పాటు టెక్నో కామన్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు యూరప్‌కు చెందిన కీలక సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అవ్వడం విశేషం.. దీంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యూరోపియన్ ఎకనామిక్ కమిషన్ డేటాబేస్‌లో ఈ రెండు మోడళ్లు అధికారికంగా నమోదైనట్లు అక్కడి వార్త సంస్థలు వెల్లడించాయి..ఈ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 30e 5G స్మార్ట్‌ఫోన్‌ X6864B మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెక్నో కామన్ 60 ప్రో 5G మొబైల్ CO7 మోడల్ నంబర్‌తో లాంచ్ కానుంది. ఈ లిస్టింగ్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ల పూర్తి ఫీచర్స్‌ అందుబాటులోకి రానప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో వీటి లాంచ్ సమయం దగ్గరపడిందని స్పష్టంగా అర్థమవుతోంది.. అంతేకాకుండా త్వరలోనే వీటికి సంబంధించిన కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 30e 5G..
గతంలో మలేషియాలో లాంచ్‌ అయిన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20e స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా ఈ కొత్త 5G ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, గత మోడల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే... ఆ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.75 అంగుళాల HD ప్లస్‌ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన యూనిసోక్ T7250 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 8MP బ్యాక్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉండడం విశేషం. రాబోయే స్మార్ట్ 30e మోడల్‌లో 5G కనెక్టివిటీతో పాటు అద్భుతమైన ప్రాసెసర్, కెమెరా అప్‌గ్రేడ్స్ ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..

టెక్నో కామన్ 60 ప్రో 5G...
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఫ్లాగ్‌షిప్ తరహా ఫీచర్లతో ఆకట్టుకున్న టెక్నో కామన్ 50 ప్రో మొబైల్‌కి సక్సెసర్‌గా కామన్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.78-అంగుళాల కర్వ్డ్ 1.5K AMOLED డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ ప్రాసెసర్‌తో లాంచ్‌ అయ్యింది.

దీని బ్యాక్‌ సెటప్‌లో రెండు 50MP కెమెరాలతో పాటు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 6,150mAh బ్యాటరీతో లభిస్తోంది. కంపెనీలు అతి త్వరలోనే ఇన్‌ఫినిక్స్, టెక్నో స్మార్ట్‌ఫోన్స్‌ను అధికారికంగా లాంచ్ తేదీలు, ధరల వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES