Instagram మ్యూజ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!
Instagram Muse AI: ఇంస్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా కొత్త ఫీచర్ మెటా పరిచయం చేసింది. దీంతో కాదు మ్యూజ్.. అసలు దీనిని ఎలా వినియోగించాలి? దీని ఉపయోగాలు ఏంటి అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Instagram Muse AI News: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల అనుభవాన్ని మరింత కొత్తగా మార్చేందుకు అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ రీల్స్ తో పాటు ఫోటోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చిన కంటెంట్ను మన అకౌంట్ ఫాలో అవుతున్న మిత్రులకు పంపేందుకు షేర్ బటన్ మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. అయితే, ఇటీవలే ఈ బటన్ పై నొక్కితే కాంటాక్ట్స్ జాబితాలతో పాటు ప్రత్యేకంగా మ్యూజ్ అనే కొత్త ఆప్షన్ కూడా కనిపిస్తుండడం చాలామంది గమనించి ఉంటారు.. అయితే దీని ప్రయోజనాలేంటి? ఈ ఫీచర్ ను ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యూజ్ అనేది మెటా అభివృద్ధి చేసిన అత్యాధునిక పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్.. కేవలం చాట్‌బాట్‌లా ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. యూసర్లు చూసే కంటెంట్ను విశ్లేషించి.. వారికి అవసరమైన సలహాలు అందించేలా దీనిని రూపొందించినట్లు మెటా వెల్లడించింది. అంతేకాకుండా దీనిని మరింత అభివృద్ధి చేసి యూజర్లకు మరిన్ని కొత్త కొత్త అనుభవాలను అందించబోతున్నట్లు కూడా తెలిపింది.
ఏదైనా అర్థం కాని పోస్ట్ లేదా వింతగా మీకు కొంచెం కష్టంగా అనిపించిన రీల్ చూస్తున్నప్పుడు.. దానికి సంబంధించిన సమ్మరీ తెలుసుకోవాలనుకుంటే. ఆ పోస్టును నేరుగా మ్యూజ్ కు షేర్ చేయవచ్చు. ఆ పోస్ట్ పై యూజర్లకు వచ్చే ఎలాంటి సందేహాలైనా ఇది సెకండ్ల వ్యవధిలో సమాధానాలను అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది..
అలాగే షాపింగ్ ప్రియలకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.. రీల్స్‌లో కనిపించే ప్రత్యేకమైన దుస్తులతో పాటు గాడ్జెట్లు, కొత్త కొత్త వస్తువుల వీడియోలను మీరు నేరుగా మ్యూజ్‌కు షేర్ చేస్తే.. ఆ ప్రోడక్ట్ బ్రాండ్‌తో పాటు.. దానికి కంపెనీ నిర్ణయించిన ధర, స్పెసిఫికేషనులతో పాటు, దీనిని ఎక్కడ కొనుగోలు చేయొచ్చు, ఆన్లైన్ స్టోర్స్‌తో పాటు ఆఫ్ లైన్ స్టోర్స్ వివరాలను కూడా ఎంతో సులభంగా అందించగలుగుతుంది..
అంతేకాకుండా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఈ కొత్త ఫీచర్ ఒక మంచి డిజిటల్ పార్ట్నర్ గా కూడా పనిచేస్తూ వస్తుందని మెటా తెలిపింది. ట్రెండ్ అయిన అంశాలపై వీడియోలు తయారు చేయడానికి ప్రత్యేకమైన స్క్రిప్ట్ అందించడమే కాకుండా క్రియేటివ్ ఐడియాస్ తో అద్భుతమైన కంటెంట్ అందించి, పోస్ట్ చేసేందుకు స్పెషల్గా ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్ కూడా అందిస్తున్నట్లు మెటా వెల్లడించింది..
దీంతో పాటు ఫుడ్ వీడియోలను షేర్ చేస్తే అందులో దినుసుల విష్ణు అందించడమే కాకుండా తయారీ పద్ధతితో పాటు, అనేక రకాల వివరాలను ఎంతో క్లియర్ గా అందిస్తుంది.. ఇక ట్రావెల్ వీడియోలను షేర్ చేస్తే.. ఆ ప్రదేశానికి సంబంధించిన అన్ని వివరాలను అందించి.. అక్కడికి ఎలా వెళ్లాలో అనే వివరాలను కూడా సూచిస్తుందట.. సాధారణ చాటింగ్ తో పాటు నిజజీవితంలో పనులు చేసి పెట్టే ఏఐ ఏజెంట్ల దిశగా మెటా ఈ అడుగు వేసినట్లు తెలుస్తోంది..