• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Ranabaali: పుట్టపర్తి దగ్గర నరుకుతా.. విజయ్ దేవరకొండ రణబాలిలో ఆ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారా..!

Ranabaali: పుట్టపర్తి దగ్గర నరుకుతా.. విజయ్ దేవరకొండ రణబాలిలో ఆ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారా..!

Ranabaali: ‘రణబాలి’ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చూపించిన మాస్ అవతార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి గెటప్‌ను మేకర్స్ రివీల్ చేయకుండా సర్‌ప్రైజ్‌గా ఉంచడంతో, సినిమాలో ఇదే బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

Written ByVishnu Priya
Published: Oct 08, 2026, 08:13 PM IST|Updated: Oct 08, 2026, 08:19 PM IST
joinshare
Ranabaali: పుట్టపర్తి దగ్గర నరుకుతా.. విజయ్ దేవరకొండ రణబాలిలో ఆ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారా..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

2

చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

3

Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!

4

Ranabaali: పుట్టపర్తి దగ్గర నరుకుతా.. విజయ్ దేవరకొండ రణబాలిలో ఆ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారా..!

5

Instagram మ్యూజ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ranabaali: ఈ మధ్య తెలుగు సినిమాల్లో యాక్షన్, వైలెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా యాక్షన్ కూడా ఉండాలి. కానీ కొన్ని సినిమాల్లో చూపిస్తున్న హింస ప్రేక్షకులకు షాక్ ఇచ్చే స్థాయిలో ఉంటోంది. దీంతో ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైలెన్స్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతోంది అనే చర్చ మొదలైంది.

ఇటీవల వచ్చిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’లో కూడా చాలా రా అండ్ ఇంటెన్స్ సీన్లు కనిపించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా కఠినంగా అనిపించాయి. ప్రేక్షకులు కూడా కొన్ని సీన్లు చూసిన తర్వాత సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా కథకు ఆ వైలెన్స్ అవసరమా అనే ప్రశ్న కూడా వచ్చింది.

ఇక రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలో కూడా భారీ ఎమోషన్స్, యాక్షన్ సీన్ల గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ ట్రైలర్ చూస్తుంటే కూడా ఇదే ప్రశ్న వస్తోంది.

అక్టోబర్ 8న ‘రణబాలి’ ట్రైలర్ విడుదలైంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండను చాలా కొత్తగా, రఫ్ లుక్‌లో చూపించారు. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. బ్రిటిష్ అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టే సమయంలో వారికి ఎదురు తిరిగే వ్యక్తిగా విజయ్ కనిపిస్తున్నాడు.

 

అయితే ట్రైలర్‌లోని కొన్ని సీన్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక చిన్న బాబును పొయ్యిలో వేసి, పైన మూత పెట్టే సీన్ చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఆ సీన్ చూసిన తర్వాత సినిమాలో ఇలాంటి వైలెంట్ సీన్లు ఇంకా ఎన్ని ఉంటాయో అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.

అయితే ‘రణబాలి’లో కేవలం వైలెన్స్ మాత్రమే లేదని ట్రైలర్ చెబుతోంది. విజయ్, రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రష్మిక జయమ్మ పాత్రలో కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కొన్ని లైట్ కామెడీ, ఎమోషనల్ సీన్లు కూడా ఉన్నాయి.

మరోవైపు హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించడం సినిమాకు మరో ఆకర్షణగా మారింది. విజయ్, ఆయన మధ్య ఫేస్ ఆఫ్ సీన్లు ఎలా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా పుట్టపర్తి దగ్గర నరుకుతా అనే డైలాగ్ కూడా ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. కానీ చివరి సీన్ చూస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ అవతారంలో కాసేపు కనిపించనున్నారు అని అర్థమవుతుంది. ఆ అవతారానికి సంబంధించి పూర్తి గెటప్ అయితే ఈ ట్రైలర్ లో చూపివ్వలేదు.

మొత్తానికి ‘రణబాలి’ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న ఓవర్ వైలెన్స్ ట్రెండ్‌ను ఫాలో అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైలెన్స్ కథలో భాగంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ కేవలం షాక్ కోసం ఎక్కువగా చూపిస్తే మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు. మరి ‘రణబాలి’ విషయంలో ఏం జరుగుతుందో అక్టోబర్ 16న సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

Read More:‘బా బా బ్లాక్ షీప్’ మూవీపై మేఘాలయ సీఎం ప్రశంసలు.. సినిమాలో అంతగా ఏముందంటే..?

Read More: ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie