SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

50MP ట్రిపుల్ కెమెరా.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌.. iQOO 16 ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Iqoo 16: త్వరలోనే మార్కెట్‌లోకి ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ చైనాలో సెప్టెంబర్‌ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది ఎన్నో రకాల అద్బుతమైన ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 12:21 IST | Updated: Nov 19, 2026, 12:31 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Iqoo 16: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో  సబ్ బ్రాండ్ ఐక్యూ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ ఐక్యూ 16 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది వచ్చే నెలలో భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో మార్కెట్లోకి ఐక్యూ 15 స్మార్ట్‌ఫోన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే, దీనికి సక్సెసర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సెప్టెంబర్‌లో చైనాలో విడుదల చేసింది. త్వరలోనే భారత మార్కెట్‌లోకి రావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక్షమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా కూడా దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో ప్రముఖ టిప్‌స్టర్  ప్యాషనేట్ గీక్జ్ ఈ ఫోన్ టీజర్‌ను లీక్ చేయడంతో టెక్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది.. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. గీక్‌బెంచ్ డేటాబేస్‌లో vivo I2607 మోడల్ నంబర్‌తో దీని గ్లోబల్ వేరియంట్ లిస్ట్ అయినట్లు కూడా తెలుస్తోంది..

చైనా వేరియంట్ స్పెసిఫికేషన్ల వివరాల ప్రకారం.. ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్‌లో 6.85 అంగుళాల 2K ప్లస్‌ సాంసంగ్ M16 LTPO AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 10,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 5, జెన్ 6 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అడ్రెనో GPUను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇది అద్బుతమైన ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్OS 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది..

వెనక భాగంలో అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది.. సెల్ఫీల కోసం ఫ్రంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది.. ఇందులో కంపెనీ ఏకంగా ఎంతో శక్తివంతమైన 8,400 mAh భారీ బ్యాటరీని కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES