SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భారత్‌లోకి Iqoo Z12 Lite 5G ఫోన్‌.. లాంచ్‌కు ముందే అదిరిపోయే ఫీచర్లు లీక్!

Iqoo Z12 Lite 5G: భారత మార్కెట్‌లోకి ఐక్యూ జెడ్12 లైట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇది చూడడానికి చాలా ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 12:32 IST | Updated: Nov 18, 2026, 12:33 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Iqoo Z12 Lite 5G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో  సబ్ బ్రాండ్ iQOO.. భారత మార్కెట్లో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.. గత కొన్నేళ్లుగా  బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ వస్తున్న ఈ సంస్థ.. ఇటీవలే  ఐక్యూఓఓ జెడ్11 లైట్ మోడల్‌ను లాంచ్ చేసింది.. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గానే మార్కెట్‌లోకి ఐక్యూ జెడ్12 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ కొత్త ఫోన్ పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించిన సంగతి తెలిసిందే..

తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం..ఈ ఐక్యూ జెడ్12 లైట్ స్మార్ట్‌ఫోన్  I2510 అనే మోడల్ నంబర్‌తో గూగుల్ ప్లే కన్సోల్  సపోర్టెడ్ డివైజ్‌ల లిస్ట్‌లో కూడా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేర్వేరు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచంలోని ఆయా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఈ రెండు వేరియంట్ల అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిజైన్ విషయానికొస్తే.. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. కుడి వైపున చాలా ప్రత్యేకమైన పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ కంట్రోల్ బటన్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

ఐక్యూ జెడ్12 లైట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఇందులో 720 x 1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన LCD టచ్‌స్క్రీన్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ ఫోన్ లాంచ్ తేదీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అందించలేదు..

ఈ ఏడాది జూలైలో భారత్‌లో విడుదలైన  ఐక్యూఓఓ జెడ్11 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. కొత్త మోడల్‌పై అంచనాలు భారీగా ఉన్నట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. జెడ్11 లైట్ 5G ఫోన్ 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు మాలి-G57 MC2 జీపీయూ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ OS 6 సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50MP సోనీ IMX852 ప్రధాన సెన్సార్‌తో పాటు 0.08MP సెకండరీ కెమెరాతో పాటు ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES