SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రూ.14,999కే itel City 300 స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లలో..

itel City 300 5G: భారత మార్కెట్‌లోకి ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన కలర్‌ ఆప్షన్‌తో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాకుండా 5000mAh భారీ బ్యాటరీతో లభిస్తోంది. అయితే, కొత్త కలర్‌కి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 13:31 IST | Updated: Nov 19, 2026, 13:32 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

itel City 300 5G: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐటెల్ అద్భుతమైన ముందడుగు వేసిందిగా భావించవచ్చు.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న తమ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్  ఐటెల్ సిటీ 300 5G మోడల్‌లో కంపెనీ దిమ్మతిరిగే కలర్‌ మొబైల్‌ను విడుదల చేసింది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌లో భాగంగా కేవలం బోల్డ్ ఇండిగో కలర్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు డార్క్ రూబీ, మిస్ట్ బేజ్ కలర్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.

యువతను ఆకట్టుకునేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా స్లిమ్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం 8.4 మి.మీ మందంతో చేతిలో పట్టుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో 6.67-అంగుళాల HD ప్లస్‌ LCD డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. అలాగే 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు, స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను ఈ స్క్రీన్ సపోర్ట్‌ను కూడా అందిస్తూ వస్తోంది..

ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ UNISOC T8200 ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ముఖ్యంగా ఈ ఫోన్ అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. తక్కువ మెమరీ వినియోగంతో అద్భుతమై స్పీడ్‌తో పనిచేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.

ఫోటోగ్రఫీ పరంగా చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ఆటోఫోకస్ కూడిన 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇక రోజంతా ఫోన్ వాడేందుకు వీలుగా 5000mAh భారీ బ్యాటరీని కూడా కంపెనీ అందిస్తోంది. దీనికి 10W ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం..

వినియోగదారుల డేటా సెక్యూరిటీ కోసం ఫోన్ పక్క భాగంలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందిస్తూ వస్తోంది.. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G నెట్‌వర్క్, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPSతో పాటు USB టైప్-C పోర్ట్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఆప్షన్ కూడా లభిస్తోంది..భారత మార్కెట్లో ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌తో పాటు  64GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ.14,999తో అందుబాటులోకి వచ్చింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES