SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టెన్త్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. చెలరేగిన రాజకీయ దుమారం!

Bihar Minister Controversial Remarks: బిహార్ లోని జముయి జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దారుణంపై బీహార్ మంత్రి శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.

Written By Bhoomi
Published: Sep 22, 2026, 11:13 AM IST | Updated: Sep 22, 2026, 11:14 AM IST
Image Credit: Bihar Minister Controversial Remarks:
Join

Jamui Girl Harassment: బిహార్ లోని జముయి  జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దారుణంపై బీహార్ మంత్రి శ్రావణ్ కుమార్  చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా మండిపడుతుండగా..ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం జముయి జిల్లాలో కోచింగ్ క్లాసుల నుంచి స్కూటర్ పై తోటి విద్యార్థితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా.. 10వ తరగతి అమ్మాయిని కొందరు యువకులు అడ్డగించారు. అబ్బాయిపై దాడి చేసి.. ఆమెను లైంగికంగా వేధించారు. విద్యార్థిని చేతులు జోడించి వేడుకుంటున్నా.. వదలకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సెప్టెంబర్ 21న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి పోక్సో చట్టం, భారత శిక్షాస్మృతి కింద ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్ఐటి) కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, "ప్రపంచం నేరరహితం కాదు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిందితులు తప్పించుకోలేరు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వీడియోపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఇది "చాలా కలవరపరిచేదిగా" ఉందని అన్నారు. సాయంత్రం 7 గంటలకు కూడా ఒక బాలిక సురక్షితంగా లేదా అని ఆయన ప్రశ్నించారు. "మేము సిగ్గుపడుతున్నాము, కానీ ప్రభుత్వం కాదు" అని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న "గూండా రాజ్"ను ఆయన తీవ్రంగా విమర్శించారు.  ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

 

Also Read:  మొత్తానికి శాంతించిన బంగారం ధరలు.. సెప్టెంబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!!

 

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES