SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మధ్యప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు!

Madhya Pradesh Earthquake: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది..ఖర్గోనే పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ సమయంలో భారీ శబ్ధాలు రావడంతో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 11:14 AM IST | Updated: Nov 14, 2026, 11:15 AM IST
Image Credit: ZEE TELIUGU NEWS
Join

Madhya Pradesh Earthquake News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.. ముఖ్యంగా ఖర్గోనే జిల్లా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనల తీవ్రత భారీగా ఉండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తమ రోజువారీ పనులు చేసుకుంటున్న ప్రజలకు, ఒక్కసారిగా భూమి కదులుతుట్లు, ఏదో జరిగిపోతున్న అనుభూతి కలిగిందట.. ఇళ్లలోని వస్తువులు కదలడంతో పాటు భారీగా శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఉలిక్కిపడ్డారట.. భూకంపం సంభవించిందని గ్రహించిన వెంటనే.. ప్రాణభయంతో ప్రజలంతా తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. చిన్నారులతో పాటు వృద్ధులను తీసుకుని సురక్షితమైన ప్రదేశాలకు చేరుకున్నారట. కొద్దిసేపటి వరకు తిరిగి ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా ప్రజలు బయపడి పోయారని సమాచారం.

ఖర్గోనే పట్టణంతో పాటు సమీప గ్రామాల్లోనూ.. ఈ ప్రకంపనల ప్రభావం కనిపించిందని అధికారులు తెలుపుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ.. ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాయి.. ప్రకంపనల తీవ్రత మధ్యస్థంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం గానీ.. భారీ ఆస్తినష్టం గానీ సంభవించలేదని సమాచారం..

అయితే.. కొన్ని పాత ఇళ్ల గోడలకు స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.. మరోసారి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందేమోనన్న ఆందోళనతో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపే అవకాశాలున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. భూకంప కేంద్రం ఎక్కడ ఉంది? ఎంత లోతులో సంభవించిందనే వివరాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని.. అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సూచించిందట...
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES