• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Vivo T6x 5G: వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు లీక్!

Vivo T6x 5G: వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు లీక్!

Vivo T6x 5G: త్వరలోనే వివో T6x 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ గత మోడల్‌కు సక్సెసర్‌గా విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 11:39 AM IST|Updated: Nov 14, 2026, 11:41 AM IST
joinshare
Vivo T6x 5G: వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు లీక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Vivo T6x 5G: వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు లీక్!

Vivo T6x 5G: వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు లీక్!

2

మధ్యప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు!

3

గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

4

డిసెంబర్ 11 నుంచి శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి రాజయోగం.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని విజయాలు!

5

సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vivo T6x 5G News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వీవో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో పాటు దిమ్మతిరిగే డిజైన్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో లాంచ్‌ అయిన వివో T5x 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా దీనిని కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇది Vivo T6x 5G పేరుతో విడుదల కాబోతున్నట్లు టెక్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అంతేకాకుండా ఇది BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని బట్టి చూస్తే.. ఇది అతి త్వరలోనే లాంచ్‌ కాబోతున్నట్లు స్పష్టవుతుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సర్టిఫికేషన్ వివరాలు ఇవే..
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అన్విన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ఎక్స్‌లో కొన్ని ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కీలకమైన వివరాలను పంచుకున్నారు.. ఇది బీఐఎస్ లిస్టింగ్‌లో ఈ ఫోన్ V2652 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే మోడల్ నంబర్‌తో ఈ డివైజ్ ఇటీవల బ్లూటూత్ SIG సర్టిఫికేషన్‌లో కూడా కనిపించడం విశేషం... వరుసగా అంతర్జాతీయ, భారతీయ సర్టిఫికేషన్లను పూర్తి చేసుకుంటుండటంతో.. కంపెనీ ఈ ఫోన్‌ను భారత్‌లో వీలైనంత తొందరలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది..

వివో T6x 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇటీవలే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఇది ఫోటోగ్రఫీ కోసం వెనక భాగంలో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మంచి ఫోటోల కోసం ఇందులో లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్లను కూడా వివో అందించింది.. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీని కూడా కలిగి ఉండబోతోంది.

గత మోడల్ వివో T5x 5Gతో పోలిస్తే..
వివో T5x 5G ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇది 6.76 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా  120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా అందించింది. అద్భుతమైన పనితీరు కోసం.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్, IP68 + IP69 రేటింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

అలాగే గత మోడల్‌లో 7200mAh భారీ బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్, వెనుకవైపు 50MPతో పాటు 2MP కెమెరాలు.. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా.. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. వీటన్నింటినీ బట్టి చూస్తే.. రాబోయే వివో T6x 5G మరింత శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరా సామర్థ్యంతో బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News