SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 25 నుంచి వైన్‌ షాపుల్లో కొత్త రూల్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే చుక్క కూడా అమ్మరు!

Liquor New Rules 2026: మధ్యప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి వైన్‌ షాపులో విక్రయించే మద్యం తప్పకుండా సర్టిఫికేట్‌ కలిగి ఉండాలని తెలిపింది. ఈ కొత్త నిబంధన నవంబర్ 25 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 15:23 IST | Updated: Nov 21, 2026, 15:24 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Liquor New Rules 2026: కల్తీతో పాటు నకిలీ మద్యం అమ్మకాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు మధ్యప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం షాపుల్లో నవంబర్ 25 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ నూతన విధానం ప్రకారం.. ఇకపై మద్యం సరఫరా అయ్యే ప్రతి బ్యాచ్‌తో పాటు  క్వాలిటీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండటం తప్పనిసరని పేర్కొంది. క్వాలిటీ ప్రమాణాలు లేని మద్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించకూడదని అధికారులు స్పష్టం చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాష్ట్రంగా కల్తీ మద్యం కారణంగా అనేక విషాద ఘటనలు జరుగుతున్నాయట.. అయితే, వీటిని నివారించేందుకు ఎక్సైజ్ కమిషనర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో తయారయ్యే మద్యంతో పాటు విదేశీ మద్యం, బీరు తయారీ యూనిట్లలోని ల్యాబ్‌లలో ప్రతి బ్యాచ్‌కు కెమికల్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పరీక్షల్లో సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాతే.. సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపడానికి అనుమతి లభిస్తుందని అధికారులు తెలిపారు.. అంతేకాకుండా, మద్యం దుకాణాల యజమానులు తమ షాపుల్లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఈ నాణ్యత సర్టిఫికెట్‌ను డిస్ల్పే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారులు అడిగితే, తప్పకుండా గిడ్డంగి ఇన్‌ఛార్జ్‌లు కచ్చితంగా ఈ ల్యాబ్ రిపోర్ట్ కాపీని చూపించాల్సి ఉంటుందని తెలిపారు..

మద్యం తయారీ నుంచి అమ్మకాల  వరకు ప్రతి దశలో క్వాలిటీ ఉండేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మద్యం స్టాక్ గోదాంకు చేరుకోగానే.. దానికి సంబంధించిన క్వాలిటీ సర్టిఫికెట్‌ను  ఇ-ఎక్సైజ్ పోర్టల్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా మద్యం బ్యాచ్‌కు సర్టిఫికెట్ లేకపోయినా.. అందులో వివరాలు క్లియర్‌గా లేకపోయి.. లేదా అనుమానాస్పదంగా ఉన్నా ఆ స్టాక్‌ను వెంటనే పక్కన పెట్టేస్తారట..

అలాంటి మద్యాన్ని ఏ దుకాణానికీ సరఫరా చేయరని అధికారులు తెలిపారు.. జిల్లా ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంటుందని పై అధికారులు తెలిపారు. నిబంధనలను పాటించకపోతే.. లైసెన్స్‌, కాంట్రాక్టర్లు క్లోజ్‌ చేసి.. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ఈ నిర్ణయంతో మద్యం ప్రియులకు మంచి మద్యం అందడమే కాకుండా.. కల్తీ మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES