SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కొత్త పెళ్లి కోసం కిరాతకం.. వదినను హ*త్య చేసిన మరిది.. అసలేం జరిగిందంటే?

Crime Telugu News: వివాహేతర సంబంధం ఊహించని మలుపుకు దారి తీసింది.. సీతాపూర్‌లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. వివాహేతర సంబంధం కారణంగా మరిది ఓ వదినను హ*త్య చేశాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 13:01 IST | Updated: Nov 20, 2026, 13:02 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Crime Telugu News: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతూ వస్తున్నాయి. క్షణికావేశంతో పాటు స్వార్థం మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తూ వస్తోంది.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఇలాంటిదే ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.. తన వివాహానికి అడ్డుపడుతోందన్న కోపంతో.. సొంత వదిననే అత్యంత కిరాతకంగా హ**తమార్చాడో మరిది.. ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాపూర్ ప్రాంతానికి చెందిన అనూప్ కుమార్ అనే యువకుడు.. తన సొంత వదిన అయిన పింకీతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వీరిద్దరి మధ్య ఈ బంధం విడదీయలేని ప్రేమగా మారింది. అయితే, ఇటీవల అనూప్ కుమార్‌కు వేరే యువతితో వివాహం నిశ్చయమైందట.. పెళ్లి కుదరడంతో అనూప్ తన ప్రవర్తన మార్చుకుని.. వదిన పింకీని దూరం పెట్టడం ప్రారంభించాడట..

అనూప్ మరొకరిని వివాహం చేసుకోవడం పింకీకి ఏమాత్రం ఇష్టం లేకుండా పోయిందట.. అతడి పెళ్లిని ఆమె తీవ్రంగా తప్పుబట్టిందట.. తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకోవద్దని.. ఈ వివాహాన్ని ఆపాలని అనూప్‌పై ఒత్తిడి కూడా తీసుకు వచ్చిందట. దీంతో పింకీ తన కొత్త జీవితానికి.. పెళ్లికి పెద్ద అడ్డంకిగా మారిందని అనూప్ భావించాడట.. ఎలాగైనా ఆమెను తన దారిలోంచి తొలగించుకోవాలని నిర్ణయించుకుని.. హత్యకు పక్కా ఫ్లాన్‌ వేశాడట.

పధకం ప్రకారం.. టైమ్‌ చూసి పింకీపై దాడి చేసిన అనూప్ కుమార్.. ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హ*త్య చేశాడు. అనంతరం ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగా.. ఏమీ ఎరుగనట్టు నటిస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడట. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృ*తిగా కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారట..

పోలీసుల విచారణలో కుటుంబ సభ్యుల కదలికలతో పాటు కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించగా అనూప్ కుమార్ వ్యవహారంపై అనుమానం బలపడిందట. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. వదినతో ఉన్న వివాహేతర సంబంధంతో పాటు పెళ్లికి అడ్డుచెప్పినందుకే తాను హత్య చేసినట్లు అనూప్ నేరాన్ని అంగీకరించాడు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES