7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!
Motorola Edge 70 Neo Launch: త్వరలోనే భారత మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 నియో మొబైల్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ 7,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.
Motorola Edge 70 Neo Launch: మోటరోలా మార్కెట్‌లోకి ఎప్పుడు మంచి స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో బాగా విక్రయాలు జరగడం వల్ల కంపెనీ ఈ సిరీస్‌లో దిమ్మతిరిగే మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మోటరోలా ఎడ్జ్ 70 నియో మొబైల్‌ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టెక్ నిపుణులు సోషల్ మీడియాలో లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 8GB ర్యామ్‌తో పాటు 256 GB ఇంటర్నల్ స్టోరేన్‌ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం నాలుగు రంగుల్లో లాంచ్ కానుంది. అలాగే 6.78-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో మోస్ట్ వపర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అయితే, కంపెనీ మాత్రం ఇంకా విడుదల తేదిని అస్సలు ప్రకటించలేదు..
మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఇది 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 45W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 7,000mAh బ్యాటరీని కలిగి ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..
ఇక గత సంవత్సరం సెప్టెంబర్‌లో కంపెనీ మోటరోలా ఎడ్జ్ 60 నియోను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగిన 6.4-అంగుళాల ఫ్లాట్ pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ కూడా లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధానర కెమెరాతో పాటు అదనంగా 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, అదనంగా మరో కెమెరాను కూడా కలిగి ఉంటుంది.