Python Snake Video: కాకినాడ జిల్లా గండేపల్లి మండలలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. జనావాసాల మధ్యకు భారీ కొండచిలువ సంచారం చేసి.. తీవ్ర భయాందోళనకు గురి చేసింది.. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న ఈ భారీ పాము ఒకేసారి ఏకంగా మూడు నాటుకోళ్లను మింగేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గండేపల్లిలోని ఓ నివాసంలో రైతు రోజులాగే ఉదయం లేచి.. చూడగా తాను పెంచుకుంటున్న నాటుకోళ్లు కనిపించలేకపోయాయి.. అయితే, ఉదయమే.. బయటకు వచ్చే కోళ్లు ఈ రోజు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని చుట్టుపక్కల పరిసరాల్లో వెతకడం మొదలు పెట్టాడు.. పెరడుతో పాటు చెట్ల పొదల వైపు చూస్తూ అటుగా వెతికాడు.. అక్కడ కదలకుండా పడుకుని ఉన్న భారీ కొండచిలువ అతనికి కనిపించడంతో షాక్ అయిపోయాడు.. దాని భారీ ఆకారంతో పాటు ఉబ్బెత్తుగా ఉన్న పొట్టను చూసిన యజమాని ఒక్కసారిగా భయపడిపోయినట్లు తెలుస్తోంది.. కొండచిలువ అప్పటికే తను వెతుకుతున్న మూడు నాటుకోళ్లను ఒకదాని వెంట ఒకటి మింగేయంతో కదలలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయినట్లు ఆతను గమనించాడు.
అయితే, అక్కడ పాము ఉందని.. విషయం క్షణాల్లో గ్రామంలో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది.. దాదాపు 8 అడుగుల భారీ కొండచిలువ కావడంతో స్థానికులు దాని చూసేందుకు పరుగులు పెడుతూ వచ్చారు. నిత్యం జనాలు తిరిగే ఈ ప్రాంతాల సమీపంలోకి ఇంత పెద్ద పాము ఎలా వచ్చిందనే విషయం ఎవరికీ తెలియలేకపోయింది.. సాధారణంగా సమీపంలోని అటవీ ప్రాంతాలు లేదా పొలాల నుంచి ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఉంటుందని వన్యప్రాణి నిపుణులు భావిస్తున్నారు..
గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై.. స్థానిక అటవీ శాఖ అధికారులతో పాటు, స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.. ఇలాంటి భారీ కొండచిలువలు జనావాసాల్లోకి రావడం వల్ల చిన్నపిల్లలతో పాటు పెంపుడు మూగజీవాలకు ప్రాణాపాయం కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు..