రూ.20 వేల బడ్జెట్‌లో Motorola Edge 70 Neo? ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త టీజర్!
Motorola Edge 70 Neo: మోటరోలా (Motorola) కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 70 Neo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా (Motorola) భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెలలోనే తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లైవ్ చేసింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో భాగంగా కంపెనీ అధికారికంగా ఫోన్ పేరును ప్రకటించనప్పటికీ.. వెబ్‌సైట్ URL ఆధారంగా ఇది మోటరోలా ఎడ్జ్ 70 నియో అయి ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.. అంతేకాకుండా టీజర్ పేజీలో మీ ఫీడ్ ఒక కొత్త నియో త్వరలోనే రాబోతోంది.. అనే ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్‌తో విడుదల కాబోతోంది.. ఇందులో new అనే పదాన్ని కొట్టివేసి.. దాని స్థానంలో neo అని రాయడాన్ని బట్టి చూస్తే.. ఇది ఖచ్చితంగా నియో సిరీస్ ఫోనే అని అర్థమవుతోంది.. ఇక URLలో కనిపిస్తున్న nov26 అనే అక్షరాలను బట్టి చూస్తే.. ఈ ఫోన్ నవంబర్ 26వ తేదీన భారత్‌లో లాంచ్ అయ్యే అకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు తేదీపై మోటరోలా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు..
విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే.. ఈ ఫోన్ Dark Green కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరా రింగ్‌పై 50MP LYTIA, OISతో పాటు, Ultra HDR మార్కింగ్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందువైపు మధ్యలో పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ కూడా లభిస్తోంది..
అధికారిక ఫీచర్లను కంపెనీ ఇంకా అందుబాటులోకి తీసుకు రాలేకపోయినప్పటికీ.. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్‌ను చూస్తే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే చాలా ప్రత్యేకమైన 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో కూడిన 6.78-అంగుళాల 1.5K స్క్రీన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి కంపెనీ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లతో పాటు 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. వెనక భాగంలో 50MP సోనీ లైటియా 710 ప్రధాన కెమెరాతో పాటు 2MP మాక్రో లెన్స్‌తో పాటు సెల్ఫీల కోసం.. 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. రూ.20 వేలతో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.