మోటరోలా Signature 27 వచ్చేస్తోంది.. 50MP Sony LYTIA కెమెరా, ప్రీమియం డిజైన్‌తో అదరగొట్టే ఫీచర్లు!
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో నవంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ దీనిని గ్లోబల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Motorola Signature 27: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. గతంలో కంపెనీ సిగ్నేచర్ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన సంఘతి తెలిసిందే.. అయితే, దీనికి మార్కెట్‌లో మంచి గుర్తింపు వచ్చింది.. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది మోటరోలా సిగ్నేచర్ 27 పేరుతో భారతదేశంలో విడుదల కాబోతున్నట్లు టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే కంపెనీ కూడా తమ అధికారిక వెబ్‌సైట్‌లో మైక్రోసైట్‌ను లైవ్ చేసింది. దీనిని బట్టి చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత తొందరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి..
మోటరోలా సిగ్నేచర్ 27 ఈ సైట్‌లో దీనికి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ప్రాసెసర్ కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది.. దీనితో పాటు ఇందులో 3D వేపర్ ఛాంబర్ ఉండబోతోంది. అలాగే ఇందులో 50MP ప్రధాన కెమెరా కూడా ఉండబోతోంది.. ఈ ఫోన్‌లో LYTIA కెమెరాను కూడా కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మోటరోలా సిగ్నేచర్ 27 ఫీచర్స్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 50MP సోనీ లైటియా కెమెరాతో అందుబాటులోకి రావడం వల్ల బ్యాక్ సెట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో అనేక AI ఫీచర్లు కూడా లభిస్తున్నట్లు టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో పాటు గ్లాస్-సిరామిక్ మెటీరియల్స్‌ను వినియోగించి.. దీని బాడీని తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ ఫోన్ అద్భుతమైన ఆడియో సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు కంపెనీ బ్యాంగ్, ఒలుఫ్సెన్-ట్యూన్డ్ ఆడియోను సపోర్ట్‌ను కూడా అందిస్తూ వస్తోంది..
ఈ మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ చివరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.. అయితే, దీనిని కంపెనీ నవంబర్ నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ వంపు అంచులతో కూడిన అల్యూమినియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి రావడం వల్ల చూడడానికి చాలా అద్భుతంగా ప్రీమియంగా కనిపిస్తుంది.. వెనుక కెమెరా మాడ్యూల్ సిరామిక్‌తో పాటు బ్రష్డ్ అల్యూమినియంతో తయారు చేసినట్లు తెలుస్తోంది.. ఇది పాంటోన్ కోల్ స్మోక్‌తో పాటు పాంటోన్ కాపులెట్ ఆలివ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.