CM Revanth reddy key orders to officials on elnino impact: తెలంగాణలో ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో తాగనీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలన్నారు. తాగు నీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ముఖ్యంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని.. క్యూర్ ఏరియాలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎల్ నినో నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం పని చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు.శుద్ది చేసిన నీటిని సెక్రటేరియట్ తో పాటు సీఎంవో, అవుటర్ రింగ్ , మైట్రో రైల్ , ఇతర శాఖల కార్యాలయాల్లో వినియోగించేలా చూడాలని సీఎం తెలిపారు. పబ్లిక్ పార్క్ లు, రోడ్ల శుభ్రత కు కూడా ట్రీటెడ్ వాటర్ నే వినియోగించాలన్నారు.
భవన నిర్మాణంలో శుద్ది చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సీఎం తెల్చి చెప్పారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రెడ్కో ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఎస్టీపీల్లో నీటి శుద్దికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నీటి నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ కూడా రాజీపడేదిలేదని తెల్చి చెప్పారు. ప్రతి నీటి శుద్ది కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రస్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాటర్ ను గ్రీన్ ట్యాంకర్స్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు సీఎంకు తెలిపారు. వినియోగదారుల నుంచి కేవలం రవాణా రుసుం మాత్రమే వసూలు చేసి, నీళ్లను ఉచితంగా అందిస్తున్నట్లు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.