Rahul Gandhi: అజ్ఞానాన్ని చాపలా పర్చిన రాహుల్ గాంధీ.?.. ఏకంగా సోనియా గాంధీపై షాకింగ్ కామెంట్స్.. వీడియో..
Rahul gandhi on sonia gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Mumma sat on Papas lap rahul gandhi comments goes controversy: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. దీనిలో ఇటలీ నుంచి భారత్ లో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, తమ వైవాహిక జీవితంలో సాగిన ప్రయాణాన్ని పుస్తకాంలో రాసుకొచ్చారు. అయితే..ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి ప్రముఖులు హజరయ్యారు. అయితే.. ఈ ఆవిష్కరణ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనేక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ను గురించి, సోనియా గాంధీతో తన తండ్రికున్న అనుబంధంపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారాయి.
సోనియా గాంధీ పుస్తకావిష్కరణ సభలో ఎంపీ రాహుల్ గాంధీ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జిలో తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లానని వెల్లడించారు. కానీ అక్కడ ఆర్డర్ పెట్టిన చికెన్ మాత్రం బాగాలేదన్నారు. కానీ ప్రేమించుకొవాలనుకునే వారు తప్పకుండా యూనివర్సీటీ రెస్టారెంట్ కు వెళ్లాలని సూచించారు.
ఇదే క్రమంలో రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, తండ్రి రాజీవ్ గాంధీ డైలీ లంచ్, డిన్నర్ చేసే టప్పుడు మా అమ్మ నాన్న ఓడిలో కూర్చుని చేసేదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తాను తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు వారితో ఈ విషయంను డిస్కస్ చేశానన్నారు.
ఈ క్రమంలో తండ్రి తొడ మీద కూర్చుని మా అమ్మ డైలీ తింటుందని చేసిన కామెంట్స్ నెట్టింట రచ్చగా మారాయి. దీనిపై దుమారం రాజుకుంది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై సోనియా గాంధీతో పాటు సభలో ఉన్నవారు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యల్ని కొంత మంది నెటిజన్లు పర్సనల్ విషయాల్ని ఇలా బహిరంగంగా చెప్పుకొవడం ఏంటని తన అజ్ఞానాన్ని చాపలా ప్రదర్శించడం అంటే ఇదేగా అంటూ నెట్టింట తెగ ట్రోల్స్ చేస్తున్నారు.