West Bengal: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్‌లకు ఇక నుంచి నో ఫీజ్.. సీఎం కీలక ప్రకటన..
Cm Suvendu adhikari on govt jobs: వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు సీఎం సువేందుకు అధికారి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం మాట్లాడుతూ.. జగరల్ అభ్యర్థులకు సైతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫీజుల మినహయింపును రద్దు చేసే యోచన చేస్తుందని చెప్పుకొచ్చారు.
No more application fees for bengal govt jobs: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సర్కారు కొలువు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గొప్ప శుభవార్త చెప్పారు. ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ధరఖాస్తు ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు.ఈ మేరకు ప్రభుత్వం కీలక చర్యల దిశగా ముందుకు వెళ్తుందన్నారు. తొందరలోనే దీనిపై కీలక ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ మేదినీపూర్ జిల్లా పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం సువేందు అధికారి పాల్గొన్నారు.ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు శుభవార్తచెప్పారు.
ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500, SC/ST అభ్యర్థులకు రూ.250గా ఉన్న పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారు. వీటిని ఇక నుంచి పూర్తిగా తొలగించే ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. దీనిపైన తొందరలోనే ప్రకటన చేస్తామని సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు.
అదే విధంగా 2027 సంవత్సరం నుండి నియామక పరీక్షల వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచడం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. దీనికి అదనంగా, పట్టభద్రులకు, కళాశాలకు వెళ్లని వారికి భరోసా పథకం కింద ఆర్థిక సహాయం అందించే ప్రణాళికల్ని కూడా చేస్తున్నామని సీఎం సువేందుకు తెలిపారు.
ముఖ్యంగా యువతకు తమ ప్రభుత్వ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా గతంలో సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ పై నిప్పులు చెరిగారు. గతంలో ఫీజులు వసూలు చేశారు కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం భరోసా పథకం కింద కనీసం ఐదేళ్ల పాటు సాయం అందించేలా కసరత్తులు చేస్తుందన్నారు. అయితే.. దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి తొందరలోనే శుభవార్త చెప్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు.