SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Oppo నుంచి మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. Find X11 Pro Max ఫీచర్లు లీక్!

Oppo Find X11 Pro Max Launch: మార్కెట్‌లోకి త్వరలోనే ఒప్పో ఫైండ్ X11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం డిస్ల్పేతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 11:01 IST | Updated: Nov 18, 2026, 11:02 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Oppo Find X11 Pro Max Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. గత నెలలోనే భారత మార్కెట్లోకి విడుదలైన ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా కంపెనీ మార్కెట్‌లోకి త్వరలోనే ఒప్పో ఫైండ్ X11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా అధికారిక లాంచింగ్‌కి ముందే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు లీక్‌ అయ్యాయి.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్  వీబోలో టిప్‌స్టర్  డిజిటల్ చాట్ స్టేషన్ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక వివరాలను లీక్‌ చేశారు.. ఒప్పో అందుబాటులోకి తీసుకు రాబోతున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ పరంగా.. ప్రీమియం గ్లాస్  ఉన్నప్పటికీ, స్క్రీన్ మాత్రం పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. గ్లాస్ అంచులు ఫోన్ బెజెల్స్ దాదాపు కనిపించనంత సన్నగా మారుతాయని ఆయన లీక్‌ చేసిన వివరాల్లో తెలిపారు. టిప్‌స్టర్ నేరుగా మోడల్ పేరును చెప్పనప్పటికీ..  ఆ పోస్ట్‌లో ఉన్నది మాత్రం ఒప్పో ఫైండ్ X11 ప్రో మ్యాక్స్ అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.

ఒప్పో ఫైండ్ X11 ప్రో మ్యాక్స్ డిస్ల్పేను బట్టి చూస్తే.. ఇది చాలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే చాలా ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఇటీవలే భారత్‌లో విడుదలైన ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే, ఇది చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించడమే కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై రన్‌ అవుతుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక భాగంలో మూడు 200-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.. అంతేకాకుండా  OIS సపోర్ట్‌తో ప్రైమరీ, అల్ట్రా-వైడ్‌తో పాటు టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్‌ను అందిస్తోంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇదిలా ఉంటే..  ఒప్పో సంస్థ ఇటీవలే  రెనో 17 సిరీస్‌ను కూడా మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో స్టాండర్డ్ మోడల్‌తో పాటు రెనో 17 ప్రో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES