SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జాతరలో ఫాస్ట్‌ఫుడ్ తిని 100 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత!

Madhya Pradesh Food Poisoning: మధ్యప్రదేశ్‌లోని ఓ జాతరలో భాగంగా ఫాస్ట్ ఫుడ్ తిన్న 100 మందికి పైగా చిన్నారులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఆ చిన్నారుల్లో కడుపునొప్పితో పాటు విపరీతమైన విరేచనాలు రావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 12:04 IST | Updated: Nov 22, 2026, 12:06 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Madhya Pradesh Food Poisoning: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో ఓ స్థానిక జాతరలో ఫాస్ట్ ఫుడ్ వందమందికి పైగా చిన్నారులు అస్వస్థకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పిల్లలందరికీ ఫుట్ పాయిజన్ జరిగినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు.. అసలు ఎలా జరిగింది? ఇంతలా ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలే? అసలు ఆ ఫుడ్డులో ఏం కలిసింది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బాలఘాట్ జిల్లాలోని హిర్రీ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మాండై జాతర శనివారం ఘనంగా మొదలైంది.. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి ప్రజలతో పాటు చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక ఫాస్ట్ ఫుడ్ బండి వద్ద చాలామంది పిల్లలు మంచూరియాతో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ పదార్థాలను కొనుగోలు చేసి తిన్నారట.. అయితే వాటిని తిన్న కొద్దిసేపటికి చిన్నారులు ఒక్కొక్కరిగా కడుపునొప్పి తో పాటు వాంతులు, విరేచనాలు రావడం ప్రారంభమయ్యాయట..

ఒకేసారి పదుల సంఖ్యలో పిల్లలు కడుపునొప్పితో విలవిలలాడుతూ ఏడవడంతో జాతర ప్రాంగణంలో ఒక్కసారి గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ తో పాటు పోలీసు వాహనాలు, ప్రైవేట్ వాహనాల సహాయంతో బాధిత చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారట.. అక్కడ కొంతమందికి ప్రథమ చికిత్స అందించగా.. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న మిగతా పిల్లలను మెరుగైన వైద్యం కోసం  బాలాఘాట్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం వైద్య బృందం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యావేక్షిస్తూ వస్తోందట..

ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఘటనకు గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి.. కలుషిత ఆహారం విక్రయించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు బాధితులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అయితే జాతరతో పాటు ఉత్సవాలు జరిగే చోట విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడంలో ఆహార భద్రత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES