SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ తప్పు చేస్తే మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు పడవు.. లబ్ధిదారులకు క్లియర్ గైడ్!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 23వ విడత నిధులను మంజూరు చేశారు. ప్రస్తుతం రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నిధులు జమ కావాలంటే రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 11, 2026, 12:24 PM IST | Updated: Oct 11, 2026, 12:29 PM IST
Image Credit: PM Kisan 24th Installment:
Join

PM Kisan 24th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 24వ విడత నిధులు నవంబర్ దీపావళి సమయానికి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు వేచి చూస్తున్నారు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (DBT) ద్వారా రూ.6,000 జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నిధులు అందుతాయి. ప్రస్తుతం ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే 24వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది.

24వ విడత నిధులు పొందాలంటే రైతులు ముందుగానే ఈ పనులు చేయాలి. పిఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేసి, 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం మీ వివరాలను, ముఖ్యంగా బ్యాంక్ పేరు, పేమెంట్ స్టేటస్ ఇతర అప్‌డేట్‌లను సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. కొన్ని వార్తాపత్రికల సమాచారం ప్రకారం, కర్ణాటకలో సుమారు 5.97 లక్షల మంది రైతులు పిఎం కిసాన్ ప్రయోజనాలను కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడమే.

పిఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ-కేవైసీ సెక్షన్ లోని 'ఫార్మర్ కార్నర్' ద్వారా మీ ఆధార్ నంబర్‌తో వెరిఫై చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ చేయలేని రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలాగే, పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసి, రూ.2,000 నిధులు ఆగకుండా సులభంగా పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. దీని ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది రూ.6,000 జమ చేస్తారు, ఇది వారి సాగు ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం లబ్ధి పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడదు. అలాగే, కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథనానికి అర్హులు కావాలి. అంతేకాకుండా, రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందే వారు కూడా ఈ పిఎం కిసాన్ నిధులకు అర్హులు కారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES