Poco X8s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, ఫీచర్స్ ప్రత్యేకతలు!
Poco X8s స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. దీనిని కంపెనీ వియత్నాంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా ప్రత్యేకమైన కెమెరా సెటప్ ను కలిగి ఉండడమే కాకుండా.. మోస్ట్ పవర్ఫుల్ బ్యాటరీతో లభిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Xiaomi సబ్ బ్రాండ్ విడుదల చేసే మొబైల్స్‌కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మార్కెట్లోకి పోకో విడుదల చేసి స్మార్ట్‌ఫోన్స్ యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో మంచి poco మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే.. Poco X8s బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. దీనిని కంపెనీ విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన ప్రాససర్ను కలిగి ఉంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X8sను కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కాకుండా వియత్నాంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన ధరల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా వియత్నాంలో దీని ధర VND 11,500,000 ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భారత మార్కెట్లో దీని ధర రూ.42 వేలకు పైగానే ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ ధర భారత కరెన్సీలో రూ.51 వేళలో లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులోని మొదటి వేరి అంటే 8gb ర్యామ్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 12gb ర్యామ్, 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది.. మొత్తం ఇది మూడు కలర్లలో లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన విక్రయాలను కంపెనీ నవంబర్ 9వ తేదీ లోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
పోకో X8s ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..
పోకో X8s స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన 6.35-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే చాలా ప్రత్యేకమైన LTPO OLED ప్యానెల్‌తో లభించడం విశేషం. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది వెలుతురులో కూడా చాలా అద్భుతంగా కనిపించేందుకు గరిష్ట బ్రైట్నెస్ 3500 నిట్స్ తో లభిస్తోంది. దీంతోపాటు అద్భుతమైన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.. ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది..
ఇక ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభించబోతోంది. దీని సెకండరీ కెమెరా 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉండడం విశేషం. ఇక ఫ్రంట్ భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన 6,330mAh బ్యాటరీ ఉంది, ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు చాలా ప్రత్యేకమైన రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.. ఇందులో అద్భుతమైన కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది..