Thief arrived in car and theft goat Video goes viral: సోషల్ మీడియాలో ప్రతి రోజు బోలేడు వీడియోలు ట్రెండింగ్ గా మారుతాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్య కరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే చాలా వింతగా ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు చూస్తుంటే ఆలోచింపచేస్తాయి. ఇటీవల కొంత మంది కేటుగాళ్లు ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. బంగారం ధరలకు సైతం రెక్కలు రావడంతో చాలా మంది చోరీలు చేస్తున్నారు. సింగిల్ గా ఉన్న వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు.
🐐 కార్లో వచ్చిన కాస్ట్లీ దొంగలు మామూలు దొంగల్లా కాకుండా, కారులో వచ్చి మరీ మేకలనే ఎత్తుకెళ్లడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. https://t.co/I86hAIjdTG
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 21, 2026
ఇటీవల చాలా మంది తమ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడైన కాస్తంతా అనుమానస్పద కదలికల్ని గమనించిన వెంటనే దాన్ని సీసీటీవీ ఫుటేజీలో గమనిస్తున్నారు. అది కాస్త వింతగా ఉంటే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది కేటుగాళ్లు కారులో వచ్చారు. రోడ్డు పక్కనున్న మేకల్ని చూశారు.
ఆ తర్వాత నెమ్మదిగా కారును మేకల వద్దకు తీసుకెళ్లారు. స్పీడ్ గా కారులో నుంచి దిగి రెండు మేకల్ని ఎత్తుకుని కారులోకి దూరి కూర్చున్నారు. ఆ తర్వాత కారును అక్కడి నుంచి వేగంగా వెళ్లనిచ్చారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.