SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సొంత ఆస్తులు అమ్మి ఇంజన్ తయారీ.. లీటర్ పెట్రోల్‌కు 176 కిలోమీటర్ల మైలేజీ!

176 Kmpl Mileage Engine: ప్రయాగ్‌రాజ్‌లో శైలేంద్ర అనే వ్యక్తి ఏకంగా 176 మైలేజీని అందిచే ఇంజన్‌ను తయారు చేశారు. అతను సిక్స్-స్ట్రోక్ ఇంజన్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఇంజన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 16:46 IST | Updated: Nov 20, 2026, 16:47 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

176 Kmpl Mileage Engine: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో పాటు వాహన కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శైలేంద్ర సింగ్ గౌర్ ఒక అద్బుతమైన ఆవిష్కరణతో ట్రెండింగ్‌లో నిలిచారు. సాధారణ బైకులు లీటరు పెట్రోల్‌కు 50 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే.. తాను తయారు చేసిన ఇంజన్ ఏకంగా 176 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆయన వెల్లడించారు.

ఈ అద్భుతాన్ని చేసేందుకు శైలేంద్ర సింగ్ 18 ఏళ్ల కఠోరంగా శ్రమించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వాహనాల్లో ఉండే ఫోర్-స్ట్రోక్ ఇంజన్ స్థానంలో.. ఆయన అత్యంత ప్రత్యేకత కలిగిన సిక్స్-స్ట్రోక్ ఇంజన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన, ఇంజన్ తయారీ కోసం ఆయన భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్ని సమస్కలు వచ్చిన వెనకడుగు వేయని శైలేంద్ర.. తన సొంత ఆస్తులను సైతం అమ్మి.. ఈ ప్రాజెక్టు చేశారట. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని తెలిపారు.

ఈ ఇంజిన్ ప్రత్యేకత ఇదే?
శైలేంద్ర తయారు చేసిన ఈ సిక్స్-స్ట్రోక్ ఇంజన్ పెట్రోల్‌ను అత్యంత సమర్థవంతంగా మండించేలా డిజైన్ తయారు చేశారట. దీనివల్ల సాధారణ ఇంజన్లతో పోలిస్తే.. ఇంధన వినియోగం భారీగా తగ్గడమే కాకుండా.. వాతావరణంలోకి విడుదలయ్యే హానికరమైన కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన వెల్లడించారు. దీని వల్ల సామాన్యులకు, పర్యావరణానికి మేలు చేసేలా ఈ ఇంజన్ పనిచేస్తుందని ఆయన అన్నారు.

శైలేంద్ర సింగ్ కృషికి గుర్తింపుగా ఆయన తయారు చేసిన ఈ ఇంజన్ టెక్నాలజీకి ఇప్పటికే రెండు పేటెంట్లు లభించడం చాలా విశేషం.. అయితే, లీటరు పెట్రోల్‌కు 176 కిలోమీటర్ల మైలేజీ వస్తుందన్న ఈ ఇంజన్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదైనా కొత్త ఆటోమొబైల్ టెక్నాలజీ మార్కెట్లోకి రావాలంటే.. నిపుణుల ఆధ్వర్యంలో స్వతంత్రంగా పరీక్షలు జరగాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లో ఈ ఇంజన్ సామర్థ్యంతో పాటు మైలేజీ నిజమని క్లైమ్‌ అవుతే.. భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో ఇదొక పెను విప్లవంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి శైలేంద్ర ఆవిష్కరణ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రెండ్‌ అవుతూ వస్తోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES