10,000mAh బ్యాటరీతో కొత్త Redmi K100 ఫోన్.. ఫీచర్లు లీక్!
Redmi K100: భారత మార్కెట్లోకి Redmi K100 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.
Redmi K100 Latest News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి (Xiaomi) సబ్-బ్రాండ్ రెడ్మీ మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది Redmi K100 పేరుతో లాంచ్ కానుంది. గతంలో రెడ్మీ K100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే దీనికి బేస్ వేరియంట్‌గా K100 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ..
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో (Weibo)లో లీక్ చేసిన వివరాల ప్రకారం... ఈ రెడ్మీ K100 స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాధారణ ఫ్లాగ్షిప్ ఫోన్లలో 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీని మనం చూస్తూ ఉంటాం.. అయితే, ఇందులో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది..
అల్ట్రా-స్మూత్ డిస్ప్లే
ఈ డిస్ప్లేకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ 6.9 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా గేమింగ్‌తో పాటు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను సరికొత్త అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లేందుకు 185Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం..
ఇందులో కంపెనీ క్వాల్కామ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Eliteను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా హెవీ గేమింగ్ సమయంలో లాగ్ లేకుండా హై-గ్రాఫిక్స్ రన్ అయ్యేలా ప్రత్యేకంగా డెడికేటెడ్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ కోసం ఇందులో అత్యాధునిక 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా లబిస్తోంది. అయితే, దీనిని కంపెనీ అత్యంత త్వరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.