Redmi Note 18 5G వచ్చేస్తోంది.. 8,888mAh బ్యాటరీతో దుమ్మురేపే ఫోన్.. ఫీచర్లు లీక్!
Redmi Note 18 5G: భారత మార్కెట్‌లోకి రెడ్‌మి నోట్ 18 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ దిమ్మతిరిగే ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది అద్భుతమైన మోడల్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 18 5G: బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ట్రెండ్‌లను సృష్టించే రెడ్‌మి.. ఇప్పుడు మరో అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. రెడ్‌మి నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా రెడ్‌మి నోట్ 18 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు తాజాగా ఒక సర్టిఫికేషన్‌లో అందుబాటులోకి వచ్చాయి. విడుదల కంటే ముందే ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ వివరాలు లీక్ అవ్వడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రముఖ టిప్‌స్టర్ పేపర్‌కింగ్13 అందించిన సమాచారం ప్రకారం.. రెడ్‌మి నోట్ 18 5G డిజైన్, ఇతర ఫీచర్ల పరంగా పాత మోడల్ రెడ్‌మి నోట్ 17 5Gకి దాదాపు రీబ్రాండెడ్ వెర్షన్‌లాగే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఇందులో కంపెనీ భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి పనిచేసేలా కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది..
సర్టిఫికేషన్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్ చైనీస్ వేరియంట్‌కు మిస్ట్ (Mist) అనే కోడ్‌నేమ్‌తో పాటు M077CE అనే మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. మార్కెట్లను బట్టి దీనిని రెడ్‌మి నోట్ 18, రెడ్‌మి నోట్ 18 5Gతో పాటు పోకో M8 పవర్ 5G పేర్లతో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. బ్యాటరీ విషయానికి వస్తే.. చైనాలో విడుదలయ్యే మోడల్ ఏకంగా 8,888mAh భారీ బ్యాటరీతో లాంచ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ వేరియంట్ 8,100mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఈ రెండు వేరియంట్లు కూడా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది..
గతంలో వచ్చిన రెడ్‌మి నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్ 6.99-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, రాబోయే రెడ్‌మి నోట్ 18 5Gలో కూడా ఇవే తరహా ఫీచర్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది..
రెడ్‌మి నోట్ 18 సిరీస్‌లో మొత్తం మూడు మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన టాప్ వేరియంట్ రెడ్‌మి నోట్ 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 10,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. మొదట చైనాలో విడుదలైన తర్వాత.. ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.