అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే శబరిమల ప్రసాదం.. ఇండియా పోస్ట్ కీలక నిర్ణయం!
Sabarimala Ayyappa Prasadam Home Delivery: శబరిమలలో మండల సీజన్ దృష్టిలో పెట్టుకొని అనే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాయి. అయ్యప్ప స్వామి భక్తులను దృష్టిలో పెట్టుకుని.. ఇంటి ముందుకే ప్రసాదం అని ప్రత్యేకమైన కాన్సెప్ట్ను తీసుకువచ్చాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Sabarimala Ayyappa Prasadam Home Delivery: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. స్వామి వారి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యే భక్తులు ప్రసాదాల ప్యాకెట్లను వెంట మూసుకెళ్లే ఇబ్బంది లేకుండా.. వాటిని నేరుగా వారి ఇంటి అడ్రస్ కి చేరవేసేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారట.. నవంబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న 41 రోజుల పాటు సాగే మండల మకరవిళక్కు యాత్ర సీజన్లో పురస్కరించుకొని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు..
దూర ప్రాంతాల నుంచి శబరిమల చేరుకునే భక్తులు తీర్పు ప్రయాణాల్లో రద్దీ కారణంగా ప్రసాదాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా శబరిమల సన్నిధానం వద్దనే భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ బుకింగ్ కేంద్రం దాదాపు 24 గంటల పాటు పనిచేయబోతోందట.. దీనివల్ల ఏ సమయంలో దర్శనం పూర్తయినా.. భక్తులు తమ ప్రసాదాలను సులభంగా బుక్ చేసుకునే వీలుంటుంది..
సన్నిధానంలోని పోస్టల్ కౌంటర్ వద్ద భక్తులు తమకు కావలసిన ప్రసాదాన్ని తీసుకొని.. ఏ చిరునామాకు పంపాలో వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందట.. తపాల శాఖ సిబ్బంది వాటిని అత్యంత భద్రంగా ప్యాకింగ్ చేసి.. స్పీడ్ పోస్ట్ సేవల ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తారట.. భక్తులు తమ యాత్రను ముగించుకుని తిరిగి ఇళ్లకు చేరుకునే లోపే.. స్వామివారి ప్రసాదం వారి ఇంటి తలుపులు తట్టేలా అధికారిక యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందించిందట..
నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మండల మకరవిళక్కు సీజన్ కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుందట.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో అయ్యప్ప మాలలు వేసుకున్న వారు శబరిమలకు తరలివస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఇలాంటి భక్తులకు.. అలాగే తమ బంధుమిత్రులకు ప్రసాదాలను పంపాలనుకునే వారికి భారత్ పోస్ట్ ప్రవేశపెట్టిన ఈ సేవలు ఎంతగానో పనికి రాబోతున్నాయి. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరిన్ని మౌలిక వసతులను కూడా దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తూ వస్తుందట..