• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

Tulsi Deepam: కార్తీక మాసంలో తులసికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఇదే నెలలో తులసి కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు. అయితే తులసి ముందు ఎందుకు నెయ్య దీపాలు వెలిగిస్తారు? దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 10:43 AM IST|Updated: Nov 15, 2026, 10:44 AM IST
joinshare
కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tulsi Deepam: హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంటా నిత్యం పూజలు అందుకునే పవిత్రమైన వృక్షం తులసి.. ముఖ్యంగా కార్తిక మాసంలో తులసి కోట ముందు అందమైన ముగ్గులు వేయడం.. సాయంకాలం సంధ్య వేళ నెయ్యితో పాటు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న ఒక అరుదైన సాంప్రదాయం. అయితే దీని వెనక కేవలం సాంప్రదాయమే కాకుండా.. ఆధ్యాత్మిక, ఆరోగ్య అంతరార్థం దాగి ఉందని కొంతమంది ఆధ్యాత్మిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా తులసి కోట ముందు ఉదయాన్నే దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట.. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కార్తీక మాసంలో వాతావరణం చల్లబడి.. సూర్యరశ్మి దగ్గు ముఖం పడుతుంది.. ఈ సమయంలో తులసి మొక్క వద్ద వెలిగించే దీపకు కాంతి పరిసరాల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి.. సానుకూలమైన శక్తిని నింపుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బియ్యప్పిండితో వేసే ముగ్గులు సూక్ష్మజీవులకు ఆహారంగా మారి చెడు క్రిములను తొలగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయట. తులసి కోట ను లక్ష్మీదేవి నివాసంగా భావిస్తూ ఉంటారు.. కాబట్టి శుభప్రదమైన ముగ్గులతో పాటు వెలుగుతున్న దీపాలు ఉన్న ఇంట సిరి సంపదలతో పాటు సుఖశాంతులు కొలువై ఉంటాయని ఆధ్యాత్మిక నిపుణులు వెల్లడిస్తున్నారు..

పురాణాల ప్రకారం.. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మతనం చేసినప్పుడు.. చివరగా ధన్వంతరి అమృత కలశం తో ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో విష్ణుమూర్తి కళ్ళ నుంచి ఆనందభాష్వాలు ఆ అమృత కలశంలో పడగా.. వాటి నుంచి దివ్యమైన తులసి మొక్క ఆవిర్భవించిందని పద్మ పురాణం క్లుప్తంగా చెబుతోంది.. సాక్షాతి లక్ష్మీదేవి అంశగా.. అత్యంత పవిత్రమైన ఔషధ గుణాలతో తులసి మాత లోక కళ్యాణం కోసం అవతరించిందని శాస్త్రం చెబుతూ వస్తోంది..

కార్తిక శుద్ధి ఏకాదశినే  ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధి ఏకాదశి అంటారు. ఆషాడ శుద్ధి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు.. నాలుగు నెలల తర్వాత ఈ రోజే మేలుకుంటారు.. మరుసటి రోజు ఉత్థాన ద్వాదశి రోజు శ్రీమహావిష్ణువు, తులసీమాతకు అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తారు. దీనినే తులసి కళ్యాణమంటారు.. హిందూ సాంప్రదాయంలో తులసీ కళ్యాణానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. తులసి కళ్యాణం చేస్తే ఎన్నో రకాల పుణ్యాలు కలుపుతాయని భక్తుల విశ్వాసం..

ఈ పవిత్ర కళ్యాణాన్ని కనులారా చూసిన.. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని.. వైవాహిక జీవితంలో దోషాలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకే కార్తీక మాసంలో ప్రతి ఇంట తులసి కోట ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ ఉంటుంది.. ముఖ్యంగా ఎప్పుడు ఎన్నో రకాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి కళ్యాణం దగ్గరుండి చూడడం ఎంతో మంచిదని నిపుణులు తెలుపుతున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Telugu News
Trending News