SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Samsung నుంచి అదిరిపోయే 5G ఫోన్‌.. Galaxy A18 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవే!

Samsung Galaxy A18 5G Launch: సాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది సాంసంగ్‌ గెలాక్సీ A18 5Gతో అందుబాటులోకి రానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 12:23 PM IST | Updated: Nov 14, 2026, 12:24 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Samsung Galaxy A18 5G Launch: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సాంసంగ్‌ మార్కెట్‌లోకి తమ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరం మొదట్లో భారత మార్కెట్‌లోకి సాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ A18 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు దాని 5G వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి సాంసంగ్‌ గెలాక్సీ A18 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కూడా కనిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లూటూత్ SIG డేటాబేస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం ఏడు వేర్వేరు మోడల్ నంబర్లతో కనిపించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా SM-A186Bతో పాటు SM-A186B-DS, SM-A186U1 మోడల్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా SM-A186U, SM-A186Wతో పాటు SM-A1860, SM-S186V మోడల్స్‌  నమోదు అయినట్లు సమాచారం.. వివిధ దేశాల మార్కెట్లు.. డ్యూయల్ సిమ్ ఆప్షన్లతో పాటు అమెరికా క్యారియర్ వేరియంట్ల కోసం సాంసంగ్‌ వీటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే.. ఈ లిస్టింగ్‌లో భాగంగా ఫోన్ విడుదల తేదీ గానీ.. పూర్తి ఫీచర్స్‌ ఇప్పటి వరకు అధికారికంగా కంపెనీ వెల్లడించలేదు.. అలాగే సాంసంగ్‌ కూడా దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు..

సాధారణంగా ఒకే సిరీస్‌లో వచ్చే 4G, 5G ఫోన్ల ఫీచర్లు చాలా వరకు ఒకేలా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో గెలాక్సీ A18 5G స్పెసిఫికేషన్లు కూడా ఇటీవల విడుదలైన A18 4G మోడల్‌ ఫీచర్స్‌ కూడా సేమ్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.. ముఖ్యంగా ఈ ఫోన్‌కు ఏకంగా ఆరు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

4G వేరియంట్‌లో ఎక్సినోస్ 1610 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే, 5G వెర్షన్‌లో మరింత వేగవంతమైన 5G చిప్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.. కెమెరా పరంగా చూస్తే.. ఇది 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES